Sai Sudarshan : సాయి సుదర్శన్ అదుర్స్
గిల్ తో కలిసి 138 రన్స్ భాగస్వామ్యం
Sai Sudarshan : అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 62 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది గుజరాత్ టైటాన్స్. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపింది. ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంది. ప్రధానంగా ఈ సీజన్ లో వరుసగా మూడు సెంచరీలతో దంచి కొట్టాడు ఓపెనర్ శుభ్ మన్ గిల్. కళ్లు చెదిరే షాట్స్ తో హోరెత్తించాడు. మరో వైపు సాయి సుదర్శన్(Sai Sudarshan) ఊహించని రీతిలో రాణించాడు. తానేమీ తక్కువ కాదంటూ దంచి కొట్టాడు ముంబై బౌలర్లను.
ఒకానొక దశలో రోహిత్ శర్మ ఏం చేయాలో పాలుపోక మౌనంగా ఉండి పోయాడు మైదానంలో. గత ఏడాది ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ వచ్చీ రావడంతోనే ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 233 రన్స్ భారీ స్కోర్ చేసింది.
ఇందులో శుభ్ మన్ గిల్ ఒక్కడే 129 రన్స్ చేశాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ చేస్తే 60 బాల్స్ లో 7 ఫోర్లు 10 సిక్సర్లు కొట్టాడు. ఇక సాయి సుదర్శన్ తనదైన రీతిలో రాణించాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 31 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు. 43 రన్స్ చేశాడు. శుభ్ మన్ గిల్ , సాయి సుదర్శన్ కలిసి 64 బంతులు ఎదుర్కొని 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Also Read : GT vs MI Qualifier2