Sailajanath : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, మాజీ ఏపీసీసీ చీఫ్ సాకె శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నీటి కేటాయింపులకు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డి పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు.
Sailajanath Comments on Jagan
పంటలు ఎండి పోయి రైతులు నష్ట పోతున్నారని ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా సాయం చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు సాకె శైలజానాథ్(Sailajanath). పరిహారం ఇవ్వాలన్న సోయి లేక పోవడం దారుణమన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, హెక్టార్ కు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో మోసం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు శైలజానాథ్. ప్రజలు ఇకనైనా మారాలని , జగన్ రెడ్డికి షాక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read : Daggubati Purandeswari : కేంద్రం వల్లనే ఏపీ అభివృద్ది