Sakshi Malik : ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీపై సాక్షి మాలిక్ ఫైర్

త‌మ సూచ‌న‌లు ప‌ట్టించు కోలేద‌ని ఆరోప‌ణ‌

Sakshi Malik : భార‌త రెజ్ల‌ర్ స‌మాఖ్య చీఫ్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై లైంగిక ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. వినేష్ ఫోగ‌ట్ సార‌థ్యంలో 30 మందికి పైగా మ‌హిళా రెజ్ల‌ర్లు ఆందోళన చేప‌ట్టారు. మూడు రోజుల పాటు నిర‌స‌న చేయ‌డంతో కేంద్రం దిగి వ‌చ్చింది. ఈ మేర‌కు ఏడుగురితో క‌మ‌టీ వేసింది.

దీనికి మేరీ కోమ్ అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న‌ట్లు భార‌త ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉష వెల్ల‌డించారు. విచార‌ణ క‌మ‌టీ పూర్తి నివేదిక ఇచ్చేంత వ‌ర‌కు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ దూరంగా ఉంచింది కేంద్రం. ఈ విష‌యాన్ని క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్ర‌క‌టించారు. డ‌బ్ల్యూఎఫ్ఐ లో ప‌ని చేస్తున్న కార్య‌ద‌ర్శిని స‌స్పెండ్ చేశారు.

ఇదంతా కావాల‌ని చేస్తున్నారంటూ బ్రిజ్ భూష‌ణ్ ఆరోపించారు. తాను వెన‌క్కి త‌గ్గేదే లేదంటూ చెప్పారు. మ‌రో వైపు ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు మ‌హిళా రెజ్ల‌ర్ల ఆరోప‌ణ‌ల‌పై. వారి ఎఫ్ఐఆర్ కాపీ త‌న‌కు కావాల‌ని కోరారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం ఇలా కొన‌సాగుతుండ‌గానే రెజ్ల‌ర్ సాక్షి మాలిక్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ద‌ర్యాప్తున‌కు సంబంధించి ప్యానెల్ కోసం ఎలాంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సాక్షి మాలిక్(Sakshi Malik). మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ రాజ్యాంగానికి ముందు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించ‌మ‌ని త‌మ‌కు హామీ ఇచ్చార‌ని , కానీ మా సూచ‌న‌ల‌ను కూడా తీసుకోలేద‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : ఐసీసీ మ‌హిళ‌ల టీ20 జ‌ట్టు డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!