Salman Butt SRH : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
గత సీజన్ లో పూర్ పర్ ఫార్మెన్స్ తో జాబితాలో ఆఖరున ఉంటే ఈసారి సేమ్ సీన్ కంటిన్యూ అవుతోంది. ఆ జట్టుకు ఆసిస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉండగా ఆయనపై వేటు వేసింది.
దీంతో అవమానకర రీతిలో నిష్క్రమించిన వార్నర్ ను వేలం పాటలో ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. పాకిస్తాన్ టూర్ సందర్భంగా మనోడు ఆడలేదు.
అతడి స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కు కెప్టెన్ గా ఛాన్స్ ఇచ్చింది. అయినా ఆ జట్టు ఆట తీరు మారడం లేదు. కోట్లు పెట్టి నికోలస్ పూరన్ ను తీసుకుంది. కానీ రాత మార లేదు.
తలరాత అలాగే కంటిన్యూ అవుతూ వస్తోంది. ఈ సందర్భంగా సల్మాన్ భట్(Salman Butt SRH )ఏకంగా జట్టులోనే కాదు ఫ్రాంచైజీలోనే ఏదో లోపం ఉందని సంచలన కామెంట్స్ చేశాడు.
జట్టును అంచనా వేయడంలో, కోచ్ లు, డైరెక్టర్లను నియమించు కోవడంలో, ప్లాన్ అమలు చేయడంలో ఏదో లోపం ఉందని పేర్కొన్నాడు భట్.
ఎక్కడో ఒక తప్పు దొర్లిందని అది ఏమిటనే దానిని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం గుర్తించాలని సూచించాడు.
Also Read : ఐసీసీ నిర్వాకం అభిమానుల ఆగ్రహం