Sam Karan : యువ క్రికెటర్ సామ్ కరన్ దుమ్ము రేపాడు. ఐపీఎల్ 16వ లీగ్ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ముంబైకి షాక్ ఇచ్చింది. 13 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ కు గాయం కావడంతో ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ధావన్ స్థానంలో వైస్ కెప్టెన్ గా ఉన్న సామ్ కరన్(Sam Karan) స్కిప్పర్ గా వ్యవహరించాడు.
ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సామ్ కరన్ 55 కీలకమైన రన్స్ చేశాడు. దీంతో భారీ స్కోర్ ను నమోదు చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్.
అనంతరం 214 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ లో కామెరాన్(Sam Karan) 67 రన్స్ చేస్తే సూర్య కుమార్ యాదవ్ 57 రన్స్ తో దంచి కొట్టారు. మ్యాచ్ ను చివరి ఓవర్ దాకా తీసుకు వెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పంజాబ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ సూపర్ బౌలింగ్ చేయడంతో తల వంచక తప్ప లేదు.
ఆఖరు ఓవర్ లో ముంబైకి గెలిచేందుకు 16 పరుగులు కావాల్సి వచ్చింది. చివరి ఓవర్ ను అర్ష్ దీప్ సింగ్ కు ఇచ్చాడు స్టాండింగ్ కెప్టెన్ సామ్ కరన్. స్కిప్పర్ నమ్మకాన్ని నిలబెట్టాడు సింగ్. కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు.
Also Read : చెలరేగిన సూర్య..కామెరాన్