Hemang Badani Samson : శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలి – బదానీ
ఫ్యూచర్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యే ఛాన్స్
Hemang Badani Samson : కేరళ స్టార్..స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ను ఎంపిక చేయక పోవడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులతో పాటు తాజా, మాజీ ఆటగాళ్లు శాంసన్ కు మద్దతుగా నిలిచారు. తాజాగా మాజీ భారత జట్టు బ్యాటర్ హేమంగ్ బదానీ(Hemang Badani) స్పందించాడు.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు. అద్భుతంగా రాణించినా ఎందుకు పక్కన పెడుతున్నారంటూ ప్రశ్నించారు బీసీసీఐని. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ కీలక టూర్ లో భారత జట్టులో శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్ ను ఎంపిక చేయక పోవడం దారుణమని అన్నాడు.
గిల్ స్ట్రైక్ రేటు 70గా ఉండగా శాంసన్ స్ట్రైక్ రేట్ 102 ఉందని గుర్తు చేశాడు హేమంగ్ బదానీ. పంత్ 11 ఇన్సింగ్స్ లు ఆడితే 10 ఇన్నింగ్స్ లలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడని తెలిపాడు . ఎందుకని రాణిస్తున్న సంజూ శాంసన్(Sanju Samson) ను ఆడించలేదని నిలదీశాడు. మరో వైపు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్.
అందరూ ప్రతి సీరీస్ ఆడాలని కాదు. పోనీ ఎంపిక కాక పోయినంత మాత్రాన మీరు తొలగించబడ్డారని లేదా మీరు సరిపోరని అర్థం కాదన్నాడు. ఇది ప్రపంచ కప్ కి రిహార్సల్ లాంటిదని స్పష్టం చేశాడు బదానీ. దేశంలో వచ్చే ఏడాది 2023లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. తప్పనిసరిగా సంజూ శాంసన్ ను ఎంపిక చేయాలని సూచించాడు.
ఇదే సమయంలో రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు హేమంగ్ బదానీ.
Also Read : హ్యారీ బ్రూక్ షాన్ దార్ ఇంగ్లండ్ జోర్దార్