Sangakkara Samson : సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలి
శ్రీలంక మాజీ కెప్టెన్ బీసీసీఐకి సూచన
Sangakkara Samson : నూతన సంవత్సరంలో తొలి మ్యాచ్ భారత జట్టు టీ20 సీరీస్ లో భాగంగా ముంబైలో శ్రీలంకతో ఆడనుంది. జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తుండడంతో కేరళ స్టార్ సంజూ శాంసన్ కు ఛాన్స్ దక్కుతుందా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రధానంగా సోషల్ మీడియాలో మరోసారి శాంసన్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు.
ఇదే సమయంలో బీసీసీఐపై నిప్పులు చెరుగుతున్నారు. త్వరలో భారత్ లో వరల్డ్ కప్ జరగనుంది. ప్రస్తుతం కేవలం టీ20 సీరీస్ కు మాత్రమే పరిమితం చేశారు సంజూ శాంసన్ ను. దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ తరుణంలో శ్రీలంక మాజీ కెప్టెన్ , రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సంజూ శాంసన్ పై(Sangakkara Samson).
అద్భుతమైన ప్రతిభ అతడిలో ఉందన్నాడు. ప్రధానంగా అతడు ఆడే విధానం మిగతా జట్ల ఆటగాళ్లకంటే భిన్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇప్పటికే బీసీసీఐ ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ లో ఆడించాల్సి ఉండగా పక్కన పెట్డడం తనను విస్తు పోయేలా చేసిందన్నాడు. ఏ జట్టులోనైనా కనీసం ప్లేయర్ కు కనీసం 10 మ్యాచ్ లు కంటిన్యూగా ఆడేందుకు అవకాశం ఇవ్వాలన్నాడు.
లేక పోతే ఆటగాడిలో ఆటపై ఉన్న ఆసక్తి నశిస్తుందన్నాడు. ఇతర ఆటగాళ్లతో ధీటుగా ఆడే దమ్ము సంజూ శాంసన్ లో ఉందని పేర్కొన్నాడు. ఇకనైనా ప్రయోగాలు ఆపేసి శాంసన్ కు వన్డే ఫార్మాట్ లో ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు బీసీసీఐకి. ప్రస్తుతం కుమార సంగక్కర చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
Also Read : పంత్.. డ్రైవర్ ను పెట్టుకోక పోతే ఎలా – కపిల్