Sanju Samson : కేరళ స్టార్ ప్లేయర్, భారత స్టార్ హిట్టర్ గా పేరొందిన మిస్టర్ పర్ ఫెక్ట్ సంజూ శాంసన్(Sanju Samson) అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ హిస్టరీలో తన కెరీర్ లో మరిచి పోలేని మైలురాయిని దాటాడు.
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాంసన్ (Sanju Samson)గత ఐపీఎల్ నుంచి ఆ జట్టుకు సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు.
ఈసారి ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలకంగా మారాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు.
కేవలం 19 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సంజూ శాంసన్ చుక్కలు చూపించాడు. 46 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు 3 భారీ సిక్సర్లు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఈ ఐపీఎల్ మ్యాచ్ సంజూ శాంసన్ కెరీర్ లో 100వది కావడం విశేషం. అంతే కాదు ఐపీఎల్ లో తన వ్యక్తిగత మొత్తం స్కోర్ ను 5 ,000 లకు చేరుకుంది.
ఏ మాత్రం జడుసు కోకుండా ఆడటం అతడి నైజం. అంతే కాదు ఎలాంటి బంతులనైనా కళ్లు చెదిరేలా సిక్సర్లుగా మల్చడంలో అతడికి అతడే సాటి. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ముగిసే సరికి 5 వేల 35 పరుగులు చేశాడు శాంసన్.
ఈ సీజన్ లో 201 పరుగులు చేశాడు. జట్టుకు మిస్టర్ కూల్ కుమార సంగక్కర తోడు కావడంతో ఆ జట్టుకు అదనపు బలం చేకూరినట్లయింది. మొత్తంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన సంజూ శాంసన్ ను మేనేజ్ మెంట్ ప్రత్యేకంగా అభినందించింది.
Also Read : చుక్కలు చూపించిన జోస్ బట్లర్