Mumbai Indians : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ లో రోజు రోజుకు కొత్త వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు బిగ్ కంపెనీలు స్పాన్సర్లుగా ఉన్నాయి.
తాజాగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ఇంత కాలం స్పాన్సర్ గా వ్యవహరించిన శాంసంగ్ షాక్ ఇచ్చింది. ఈసారి యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ -2021 లీగ్ లో ముంబై ఇండియన్స్ ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో టాప్ లో ఉంది సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్. ఇదిలా ఉండగా 2018 సంవత్సరం నుంచి నేటి దాకా ఇదే టాప్ స్పాన్సర్ గా కొనసాగుతూ వచ్చింది.
అయితే ఈ సంవత్సరంతో ముంబై ఇండియన్స్ ఉన్న ఒప్పందం ముగిసింది. దీంతో తాము ముంబై ఇండియన్స్ తో కంటిన్యూ చేయడం లేదంటూ స్పష్టం చేసింది. ఒక రకంగా ముంబై ఇండియన్స్ కు ఇది పెద్ద దెబ్బ.
ఎందుకంటే ప్రపంచంలో అటు మొబైల్స్ పరంగా ఇటు గృహోపకరణాల తయారీలో టాప్ లెవల్లో కొనసాగుతూ వస్తోంది శాంసంగ్. ప్రధాన స్పాన్సర్ వైదొలగడంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ క్రెడిట్ కార్డులు జారీ చేసే స్టార్టప్ తో డీల్ ఓకే చేసుకుంది.
ప్రస్తుతం భారతీయ మార్కెట్ ను స్లైస్ కార్డ్ దుమ్ము రేపుతోంది. వ్యాపార పరంగా టాప్ లోకి దూసుకు వస్తోంది. వచ్చే మూడు సంవత్సరాల పాటు ముంబై ఇండియన్స్ తో ఒప్పందం చేసుకుంది.
ఇందుకు గాను భారీ ఎత్తున డీల్ చేసుకుంది. ఏకంగా స్లైస్ కార్డ్ రూ. 90 కోట్లకు పైగా చెల్లించేందుకు రెడీ అయినట్లు సమాచారం.
Also Read : డేల్ స్టెయిన్ కీలక కామెంట్స్