Sanath Jayasuriya : యావత్ శ్రీలంక దేశమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో చిక్కుకున్న సమయంలో భారత దేశం సాయం చేయడాన్ని స్వాగతించారు ఆ దేశానికి చెందిన మాజీ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య(Sanath Jayasuriya ). ప్రస్తుతం దేశ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆహారం, నిత్యావసర సరుకులు, ఇంధనం దొరకక నానా తంటాలు పడుతున్నారు. మరో వైపు రోజుల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. దేశంలో ఉన్న ప్రభుత్వం చేతులెత్తేసింది.
అధ్యక్షుడు రాజపక్సేను రాజీనామా చేయాలని కోరుతున్నారు. కష్ట కాలంలో భారత దేశం ఆదుకోవడంపై కృతజ్ఞతలు తెలిపారు జయసూర్య. ఈ క్రికెట్ ఐకాన్ ఇండియాను బిగ్ బ్రదర్ గా అభివర్ణించాడు.
ఊపిరి తీసుకునేందుకు సైతం ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రధాన మంత్రి మోదీ సంచలన నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించారు జయసూర్య. పొరుగు దేశంగా భారత్ ఎల్లప్పుడూ శ్రీలంకకు మద్దతుగా నిలుస్తోందన్నారు.
ఇదే సహాయ సహకారాలు ఎల్లకాలం ఉండాలని కోరారు జయసూర్య(Sanath Jayasuriya ). ప్రస్తుతం మనుగడ సాగించడం కష్టమన్నారు. ఇతర దేశాలు సైతం ఇండియా తరహాలో సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ ఐకాన్.
ఇదిలా ఉండగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకకు 2, 70, 000 మిలియన్ల ఇంధనాన్ని సరఫరా చేసింది. 24 గంటల్లోనే సరఫరా చేయడం విశేషం.
జయసూర్యతో పాటు నేషనల్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ మందులు సరఫరా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో అందించిన సహాయం ఆరోగ్య సౌకర్యాల పని తీరును నిర్దారించిందని పేర్కొన్నారు డైరెక్టర్ .
Also Read : ఈ హిట్ మ్యాన్ కు ఏమైంది