Sandhya Devanathan : మెటా ఇండియా హెడ్ గా ‘దేవనాథన్’
ప్రకటించిన ఫేస్ బుక్ - మెటా సంస్థ
Sandhya Devanathan : సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా – ఫేస్ బుక్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మెటా- ఫేస్ బుక్ ఇండియా హెడ్ గా సంధ్యా దేవనాథన్ ను నియమించినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా గురువారం అధికారికంగా తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు వాట్సాప్ ఇండియా హెడ్ గా ఉన్న అభిజిత్ బోస్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు.
ఆయనతో పాటు మెటా ప్లాట్ ఫారమ్ ల కు సంబంధించిన పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో మెటా – ఫేస్ బుక్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ప్రధానంగా మెటా – ఫేస్ బుక్ చెందిన వాట్సాప్ , ఇన్ స్టా ల యూజర్లను పెద్ద ఎత్తున తీసుకు రావడంలో, గణనీయమైన ఆదాయం వచ్చేలా చేయడంలో అభిజిత్ బోస్ తీవ్రంగా శ్రమించారు.
ఈ విషయాన్ని వాట్సాప్ వరల్డ్ వైడ్ హెడ్ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి అమెరికా తర్వాత అతి పెద్ద వ్యాపారం భారత్ నుంచే వస్తోంది. దీంతో తాజాగా అభిజిత్ బోస్ స్థానంలో కొత్త వారిని తీసుకు వచ్చింది. ప్రత్యేకించి సంధ్యా దేవనాథన్(Sandhya Devanathan) 2016 నుండి మెటా- ఫేస్ బుక్ తో అనుబంధం కలిగి ఉన్నారు.
జనవరి నుంచి ఇండియా హెడ్ గా తన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించి మెటా- ఫేస్ బుక్. మరో వైపు అజిత్ మోహన్ ప్రత్యర్థి కంపెనీ స్నాప్ ఇంక్ లో చేరేందుకు మెటా కు గుడ్ బై చెప్పాడు.
మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ బిగ్ టెక్ కంపెనీలను నియంత్రించే చట్టాలను కఠినతరం చేయడంతో ఫేస్ బుక్ భారత దేశంలో నియంత్రణ సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సంధ్యా దేవనాథన్ నియమించడం విశేషం.
Also Read : కష్టపడి పని చేయండి లేదంటే వెళ్లిపోండి