Sania Mirza : దుబాయ్ టోర్నీ త‌ర్వాత సానియా గుడ్ బై

కొడుకు కోసం త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న

Sania Mirza : భార‌తీయ టెన్నిస్ రంగంలో మ‌హ‌రాణిగా పేరొందిన హైద‌రాబాద్ కు చెందిన సానియా మీర్జా ఇక ఆట నుంచి నిష్క్ర‌మించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. క్రీడాభిమానుల‌ను విస్తు పోయేలా చేసింది. గ‌త కొంత కాలం నుంచి ఆమె రిటైర్మెంట్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. మ‌రో వైపు భ‌ర్త‌తో వేరుగా ఉంటోంద‌ని వ‌చ్చిన పుకార్ల‌కు పుల్ స్టాప్ పెట్టింది సానియా మీర్జా(Sania Mirza) .

ఆమె ప్ర‌స్తుతం దుబాయ్ లో ఉంటోంది. తాజాగా తాను ప్రొఫెష‌న‌ల్ టెన్నిస్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దుబాయ్ లో జ‌రిగే ఓపెన్ టోర్నీ త‌ర్వాత తాను సెల‌వు తీసుకోనున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. త‌నకు ఓ కొడుకు ఉన్నాడు.

వాడే త‌న ప్ర‌పంచ‌మ‌ని, వాడికి త‌ల్లి ప్రేమ ఏమిటో చూపించాల‌ని తాను అనుకుంటున్న‌ట్లు తెలిపింది. టెన్నిస్ రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది సానియా మీర్జా. స‌రిగ్గా 30 ఏళ్ల కింద‌ట టెన్నిస్ ప్ర‌పంచంలోకి ప్ర‌వేశించింది. నా క‌ల‌ల పోరాటం ఆరు సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ప్రారంభ‌మైంది.

ప్ర‌తి స‌మ‌యంలో నా పేరెంట్స్ , కోచ్ , ఫిజియో థెర‌పిస్ట్ , ఫ్యాన్స్ మ‌ద్ద‌తు ఇస్తూ వ‌చ్చారు. వారంద‌రికీ ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని పేర్కొన్నారు సానియా మీర్జా(Sania Mirza) . ఆమె ఎన్నో రికార్డులు న‌మోదు చేసింది. భార‌త దేశానికి త‌న అద్భుత‌మైన ఆట తీరుతో వ‌న్నె తెచ్చింది.

ఎన్నో అవార్డులు ఉన్నాయి. చివ‌ర‌కు డ‌బుల్స్ లో ప్ర‌పంచ నెం.1గా నిలిచింది. 2013 నుంచి సింగిల్స్ ఆడ‌టం మానేసింది. కానీ త‌న క‌ల‌ను సాకారం చేసుకోలేక పోయింది. గ్రాండ్ స్లామ్ ను సాధించ లేక పోవ‌డ‌మే త‌న‌కు మైన‌స్ అని తెలిపింది సానియా మీర్జా.

Also Read : రెండో వ‌న్డేలో టీమిండియా విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!