Sania Mirza : యుఎస్ ఓపెన్ నుండి సానియా ఔట్
గాయం కారణంగా వైదొలిగిన వైనం
Sania Mirza : గాయం కారణంగా ప్రముఖ ప్రపంచ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) యుఎస్ ఓపెన్ మెగా టోర్నీ నుండి నిష్క్రమించింది. ఇది తన రిటైర్మెంట్ ప్లాన్ ను మారుస్తుందని తెలిపింది.
త్వరలో యుఎస్ ఓపెన్ జరగనుంది. రెండు వారాల కిందట కెనడాలో ఆడుతున్న సమయంలో తన మోచేతికి గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పూర్తిగా ఫ్రాక్చర్ అయిందని తేలింది.
దీంతో ఆడడం ఇక ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. ఇదే విషయాన్ని అధికారికంగా వెల్లడించింది సానియా మీర్జా. రిటైర్మెంట్ ప్రకటన కంటే ముందే తనకు ఇలా కావడం ఒక రకంగా బాధకు గురి చేసిందని వాపోయింది ఈ టెన్నిస్ స్టార్.
కొన్ని వారాల పాటు దూరంగా ఉండాల్సి ఉంటుందని ఇది తనను మరింత నిరాశకు గురి చేసిందని పేర్కొంది సానియా మీర్జా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు ఈ విషయాన్ని ముందు గానే తెలియ చేస్తున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా మహిళల డబుల్స్ లో మాజీ ప్రపంచ నెంబర్ 1, ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ , యుఎస్ ఓపెన్ టోర్నీలను ఒక్కోసారి గెలుచుకుంది సానియా మీర్జా.
అంతే కాకుండా మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్ లో సానియా ఆస్ట్రేలియా ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ , యుఎస్ ఓపెన్ లను ఒక్కోసారి కైవసం చేసుకుంది. 2016 ఒలింపిక్ క్రీడలలో మిక్స్ డ్ డబుల్స్ లో సెమీ ఫైనల్ కు చేరుకుంది టెన్నిస్ స్టార్.
ఇదిలా ఉండగా ఈ ఏడాది చివరలో తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించింది సానియా మీర్జా(Sania Mirza).
Also Read : ఉత్కంఠ భరిత పోరులో భారత్ హవా