Sania Mirza Shoaib Malik : సానియా..షోయబ్ బంధం ‘కలే’నా
విడి పోబోతున్నారంటూ పాక్ మీడియా
Sania Mirza Shoaib Malik : ఆ ఇద్దరూ మోస్ట్ పాపులర్. వారెవరో కాదు టెన్నిస్ స్టార్ సోనియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్. ఆ ఇద్దరిలో ఒకరు భారత దేశానికి చెందిన వ్యక్తి. మరొకరు పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్. ఈ ఇద్దరు అనుకోకుండా కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. ఒక్కటయ్యారు.
వీరికి గుర్తుగా ఓ అందమైన కొడుకు కూడా ఉన్నాడు. కొన్నేళ్ల పాటు సానియా మీర్జా, షోయబ్ మాలిక్(Sania Mirza Shoaib Malik) బాగానే ఉన్నారు. ఈ తరుణంలో ఏమైందో ఏమో కానీ ఆ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ ప్రచురణ, ప్రసార, సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది.
తాజాగా మరో కీలక ప్రకటన వచ్చింది. ఇప్పటికే దూరంగా ఉన్నారని, త్వరలోనే ఈ ఇద్దరు విడి పోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా అటు షోయబ్ మాలిక్ కానీ ఇటు సానియా మీర్జా కానీ తాము విడి పోతున్నామని కానీ లేదా దూరంగా ఉంటున్నామని కానీ ప్రకటించ లేదు.
విడి పోతున్నట్లు క్లారిటీ రాలేదు. తాజాగా మరో కీలక ప్రకటన వచ్చింది పాక్ మీడియా నుంచి. వారిద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యారని న్యాయ పరమైన చిక్కులు తొలిగాక విడాకుల ప్రకటన చేయొచ్చంటూ స్పష్టం చేసింది. దీంతో సానియా, మాలిక్ ఇద్దరూ విడి పోవడం ఖాయమని తేలి పోయింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరింది. కానీ జట్టు ఫైనల్ కంటే సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల గురించి ఎక్కువగా పాక్ మీడియా ప్రయారిటీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : పీఎం కామెంట్స్ మౌనం వీడిన బాబర్