Sania Mirza : ఆడ లేనంటున్న సానియా

త్వ‌ర‌లో ఆట‌కు గుడ్ బై

Sania Mirza  : ప్ర‌పంచ టెన్నిస్ తార భార‌తీయ దిగ్గ‌జ క్రీడాకారిణి, అందాల ముద్దుగుమ్మ సానియా మీర్జా(Sania Mirza )ఇక ఆడ‌లేనంటూ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు త్వ‌ర‌లో గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

ప్ర‌స్తుత సీజ‌న్ -2022 ఆఖ‌రున ప్రొఫెష‌న‌ల టెన్నిస్ నుంచి నిష్క్ర‌మించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఆసిస్ ఓపెన్ 2022 మ‌హిళ‌ల డ‌బుల్స్ లో ఓట‌మి అనంత‌రం ఈ విష‌యాన్ని తెలిపింది.

ఉక్రెయిన్ ప్లేయ‌ర్ న‌దియా కిచ్నోక్ తో క‌లిసి బ‌రిలోకి దిగిన ఆమె తొలి రౌండ్ లోనే ఓడి పోయింది. గ‌ట్టి పోటీ ఇచ్చినా ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. ఇక మిక్స్ డ్ డ‌బుల్స్ మాత్రం ఆడ‌నుంది.

2013లో సింగిల్స్ పోటీ నుంచి త‌ప్పుకుంది. ఆమె త‌న టెన్నిస్ కెరీర్ లో 27వ ర్యాంకు సాధించింది. హైద‌రాబాద్ కు చెందిన ఈ స్టార్ ప్లేయ‌ర్ 1986 న‌వంబ‌ర్ 15న పుట్టారు.

ఆమెకు 35 ఏళ్లు. 2003లో త‌న కెరీర్ స్టార్ట్ చేశారు. నెంబ‌ర్ వ‌న్ క్రీడాకారిణిగా పేరొందారు. 2003 నుంచి 2013 దాకా ఇండియాలో నెంబ్ 1గా ఉన్నారు. అత్యంత విజ‌య‌వంత‌మైన ప్లేయ‌ర్ గా ఉన్నారు.

అత్య‌ధిక పారితోషకం అందుకునే ప్లేయ‌ర్ గా కీర్తి గ‌డించారు. ప్ర‌పంచంలోని టాప్ క్రీడాకారిణుల‌ను ఆమె ఓడించారు. మ‌ణిక‌ట్టుకు తీవ్ర గాయం కావ‌డంతో సానియా మీర్జా (Sania Mirza )సింగిల్స్ నుంచి త‌ప్పుకున్నారు.

ఆరు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అంత‌ర్జాతీయ టైటిళ్లు గెలుపొందారు. గ్రాండ్ స్లామ్ టోర్నీకి చేరిన ఒపెన్ ఎరాకు చెందిన మూడో మ‌హిళ సానియా. ఆసియా, కామెన్ వెల్త్ , ఆఫ్రో ఆసియా క్రీడ‌ల్లో 14 ప‌త‌కాలు సాధించారు.

ఇందులో ఆరు బంగారు ప‌త‌కాలు ఉన్నాయి. లెక్క‌లేనంత సంప‌ద‌తో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. పాకిస్తాన్ క్రికెట‌ర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు ఉన్నారు.

Also Read : స‌ఫారీతో పోరుకు భార‌త్ రెడీ

Leave A Reply

Your Email Id will not be published!