Sanjay Dutt Leo : సంజయ్ దత్ లియో పోస్టర్ వైరల్
తలపతి జోసెఫ్ విజయ్ తో ఢీ
Sanjay Dutt Leo : లోకేష్ కనకరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే తలపతి విజయ్ తో మాస్టర్ తీశాడు. తన ప్లాన్ ఏమిటో ముందుగానే వివరించే అరుదైన దర్శకుడు కనగరాజ్. ఇద్దరూ కలిసి మాస్టర్ తీసిన సమయంలోనే ఆలోచనలు తెగ నచ్చాయి తలపతికి. ఇంకేం మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు. కథ తనకు నచ్చిందని చెప్పిన వెంటనే వినేసి రెడీ అన్నాడు. ఇంకేం అదే లియోగా రూపుదిద్దుకుంది. ఇప్పటికే పోస్టర్లు కిర్రాక్ తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా దుమ్ము రేపుతున్నాయి.
Sanjay Dutt Leo Poster
ఇక సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ నటుడిగా పేరు పొందాడు జోసెఫ్ విజయ్. మినిమం గ్యారెంటీ ఉన్న యాక్టర్. ఇందులో ప్రతి నాయకుడి పాత్రకు బాలీవుడ్ స్టార్ సంజయ్(Sanjay Dutt Leo) దత్ ను తీసుకున్నాడు. ఇక మేకింగ్ లో తనదైన ముద్ర కనబర్చే కనగరాజ్ ఫోకస్ అంతా లియోపై ఉంది. ఇప్పటికే విడుదలైన సాంగ్ కిర్రాక్ తెప్పిస్తోంది. తమిళ సినీ రంగం నుంచి మూడు చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్. రెండు జోసెఫ్ విజయ్ నటించిన లియో. మూడు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్.
పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ విషయంలో మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Ambati Rambabu : దమ్ము లేనోడు పవన్ – అంబటి