Sanjay Manjrekar : భారత బౌలర్లపై మంజ్రేకర్ ఫైర్
బుమ్రా తప్ప ఎవరూ సక్సెస్ కాలేదు
Sanjay Manjrekar : ఇంగ్లండ్ వేదికగా జరిగిన రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ లో కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది ఆతిథ్య ఇంగ్లండ్ . ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి తనకు ఎదురే లేదని చాటింది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్ న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది.
ఆపై వరుసగా మూడు టెస్టులో గెలుపొంది సీరీస్ కైవసం చేసుకుంది. కీవీస్ ను వైట్ వాష్ చేసింది. ఇక టీమిండియా రాక ముందు నుంచే ఇంగ్లండ్ మాటల దాడి మొదలు పెట్టింది.
ఓడించడం ఖాయమని ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా ఇంగ్లండ్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ప్రధానంగా బెయిర్ స్టో చెప్పి మరీ సెంచరీలు కొట్టడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భారత జట్టు ముందుగా నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించడం విశేషం. జో రూట్ 142 రన్స్ చేస్తే బెయిర్ స్టో 114 పరుగులు చేసి సత్తా చాటారు.
ఈ తరుణంలో ఒక్క కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా తప్ప ఏ ఒక్క బౌలర్ ప్రభావం చూపలేక పోయారు. శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ సిరాజ్ పేలవమైన బౌలింగ్ తీరుతో నిరాశ పరిచారు.
భారత్ జట్టు ఓటమిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) నిప్పులు చెరిగాడు. బౌలర్ల వైఫల్యమే కొంప ముంచిందని మండిపడ్డాడు. 18 నెలల కిందట చూసిన బౌలర్ కాదంటూ ఠాకూర్ ను ఉద్దేశించి కామెంట్ చేశాడు.
ఇక మహ్మద్ సిరాజ్ అయితే తేలి పోయాడంటూ ఎద్దేవా చేశాడు.
Also Read : భారత్ కు ఐసీసీ బిగ్ షాక్