Sanjay Manjrekar : అత‌డి సేవ‌లు జ‌ట్టుకు అవ‌స‌రం

కుల్దీప్ యాద‌వ్ అయితే బెట‌ర్

Sanjay Manjrekar : స‌ఫారీ టూర్ లో అటు టెస్టు సీరీస్ తో పాటు వ‌న్డే సీరీస్ సైతం భార‌త జ‌ట్టు కోల్పోయింది. ఈ త‌రుణంలో వివాదాస్ప‌ద కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ (Sanjay Manjrekar)ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

టీమిండియా గెల‌వాలంటే మ‌రికొన్ని మార్పులు చేయాల్సిన అవ‌స‌రంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. భార‌త బౌల‌ర్లు చేతులెత్తేయ‌డం వ‌ల్ల‌నే ఓట‌మి పాల‌య్యార‌ని పేర్కొన్నాడు.

బౌలింగ్ స్పెల్ కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఊహించ‌ని రీతిలో ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను తీసుకున్నార‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అత‌డి అవ‌స‌రం లేద‌ని అనిపిస్తోంద‌ని పేర్కొన్నాడు సంజ‌య్ మంజ్రేక‌ర్(Sanjay Manjrekar).

బీసీసీఐ సెలెక్ట‌ర్లు అశ్విన్ ను ఎందుకు ఎంపిక చేశారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నాడు. మ్యాచ్ గెల‌వాలంటే మిడిల్ ఓవ‌ర్ల‌లో మేనేజ్ చేసే బౌల‌ర్లు అత్యంత అవ‌స‌రం.

ఈ విష‌యంపై ఎందుకు హెడ్ కోచ్ , జ‌ట్టు సెలెక్ట‌ర్లు ఆలోచించ‌డం లేద‌ని ప్ర‌శ్నించాడు సంజ‌య్ మంజ్రేక‌ర్. యుజువేంద్ర చాహ‌ల్ తో పాటు కుల్దీప్ యాద‌వ్ ను తీసుకుంటే భార‌త జ‌ట్టుకు బిగ్ అడ్వాంటేజ్ గా మారుతుంద‌ని పేర్కొన్నాడు.

దీని వ‌ల్ల ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాళ్ల‌ను నియంత్రించేందుకు వీలు క‌లుగుతుంద‌న్నాడు. మిడిల్ ఓవ‌ర్ల‌లో టాప్ వికెట్ల‌ను కూల్చే స‌త్తా కుల్దీప్ కు ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.

ఆశించినంత మేర భార‌త ఆట‌గాళ్లు రాణించ‌లేక పోవ‌డం దారుణ‌మ‌న్నాడు. మ‌న బౌల‌ర్లు ఎలాంటి ప్ర‌భావం చూప‌క పోవ‌డంపై సీరియ‌స్ అయ్యాడు సంజ‌య్ మంజ్రేక‌ర్.

ఈ త‌రుణంలో ఒకే ఒక్క మార్గం కొత్త బౌల‌ర్ల‌ను ఎంపిక చేసుకోవ‌డ‌మేన‌ని పేర్కొన్నాడు.

Also Read : షోకాజ్ నోటీసుపై దాదా కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!