Sanjay Manjrekar : ఎలిమేట‌ర్ మ్యాచ్ లో ఆర్సీబీకే ఛాన్స్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మంజ్రేక‌ర్

Sanjay Manjrekar : వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలిచే భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్ క్వాలిఫ‌యిర్ మ్యాచ్ -1లో 7 వికెట్ల తేడాతో ఇప్ప‌టికే గుజ‌రాత్ టైటాన్స్ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. నేరుగా ఐపీఎల్ ఫైన‌ల్ కు వెళ్లింది.

ఇక ఓడి పోయిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ శుక్ర‌వారం ఇవాళ ల‌క్నో, ఆర్సీబీతో జ‌రిగే మ్యాచ్ లో గెలుపొందిన టీమ్ తో ఆడ‌నుంది. ఫైన‌ల్ ఈనెల 29న గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ స్టేడియంలో మ్యాచ్ కు వేదిక కానుంది.

ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఇక ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఆయా జ‌ట్ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర‌మైన పోరు కొన‌సాగ‌నుంది.

ఈ సంద‌ర్భంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ లో ఎక్కువ‌గా గెలిచేందుకు ఛాన్స్ మాత్రం ఆర్సీబీకే ఉంద‌న్నాడు సంజయ్ మంజ్రేక‌ర్(Sanjay Manjrekar).

ఈ క్రికెట్ వ్యాఖ్యాత ఎలిమినేట‌ర్ మ్యాచ్ కు సంబంధించి విజేత ఎవ‌రో అంచ‌నాకు వ‌చ్చాడు. ఆ మేర‌కు తాను ఆర్సీబీ ప‌క్కాగా గెలుస్తుంద‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

క్రిక్ ఇన్ఫోతో బుధ‌వారం మాట్లాడాడు. బెంగ‌ళూరుకే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పాడు. ఎలాంటి ఒత్తిడి లోనైనా అద్భుతంగా రాణించే ఆట‌గాళ్లు ఇప్పుడు ఆర్సీబీలో ఉన్నారు.

ప్ర‌ధానంగా విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌రం ల‌క్నోకు అని తెలిపాడు. కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ పవ‌ర్ ప్లేలో త‌ట్టు కోవ‌డం క‌ష్ట‌మ‌న్నాడు. ఇక ఫినిష‌ర్ దినేశ్ కార్తీక్ ఉండ‌నే ఉన్నాడ‌ని గుర్తు చేశాడు మంజ్రేక‌ర్(Sanjay Manjrekar).

Also Read : అప‌జ‌యం విజ‌యానికి సోపానం

Leave A Reply

Your Email Id will not be published!