Sanjay Manjrekar : భారత మాజీ క్రికెటర్ , వివాదాస్పద వ్యాఖ్యాతగా పేరొందిన సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar )మరోసారి నోరు పారేసుకున్నాడు. దక్షిణాఫ్రికా టూర్ లో ఘోరంగా వైఫల్యం చెందిన భారత జట్టు మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానేను టార్గెట్ చేశాడు. కీలక కామెంట్స్ చేశాడు.
ఎన్నో మ్యాచ్ లు ఆడిన రహానే ఇలాగేనా ఆడేది అంటూ మండి పడ్డాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చేసిందన్నాడు. పనిలో పనిగా మంజ్రేకర్ మరో సూచన కూడా చేశాడు.
దేశీ వాళి మ్యాచ్ లు ఆడితే బెటర్ అని సూచించాడు. ఒక రకంగా ఎద్దేవా చేశాడు. మూడు టెస్టులు ఆరు ఇన్నింగ్స్ లలో రహానే 136 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది.
ఇక మరో ఓపెనర్ పుజారా 124 పరుగులు చేశాడు. అయితే మంజ్రేకర్ పుజారాకు ఇంకో చాన్స్ ఇస్తే బావుంటుందని పేర్కొనడం గమనార్హం. తానైతే ఇంకో టెస్టు మ్యాచ్ ఆడేందుకు రహానేకు అవకాశం ఇవ్వనంటూ కుండ బద్దలు కొట్టాడు.
దీనిపై రహానే ఫ్యాన్స్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar )పై నిప్పులు చెరుగుతున్నారు. భారత జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టి ఘనమై న విజయాలు సాధించి పెట్టిన ఘనత రహానేనని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా 2020-21 ఆసిస్ టూర్ లోనే రాణించాడని ఆ తర్వాత విఫలమవుతూ వచ్చాడని తెలిపాడు మంజ్రేకర్. 547 పరుగులు మాత్రమే చేసిన రహానే ఇక ఫామ్ లోకి వస్తాడన్న నమ్మకం తనకు లేదన్నాడు.
Also Read : భారత్ పరాజయం పరిసమాప్తం