Sanjay Raut : 20 మంది ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నారు

ప్ర‌క‌టించిన శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్

Sanjay Raut : మ‌రాఠా రాజ‌కీయం మ‌రింత ముదిరింది. ఎవ‌రికి వారు త‌మకు బ‌లం ఉందంటూ ప్ర‌క‌టించ‌డంతో ఇంకా ఉత్క‌ఠ నెల‌కొంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే రెబ‌ల్ అభ్య‌ర్థి మంత్రి ఏక్ నాథ్ షిండే త‌న‌తో పాటు 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ప్ర‌క‌టించాడు. అంతే కాదు కాంగ్రెస్, ఎన్సీపీ ల‌ను వ‌దిలేసి భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశాడు.

ఈ త‌రుణంలో నిర్ణ‌యం తీసుకోవాల్సిన గ‌వ‌ర్న‌ర్ కు క‌రోనా సోక‌డంతో ఆస్ప‌త్రిలో ఉన్నారు. ఈ త‌రుణంలో తాను ఎవ‌రికీ త‌ల వంచే ప్ర‌స‌క్తి లేదంటూ సీఎంఓ ఆఫీసును బుధ‌వారం రాత్రి ఖాళీ చేశారు.

ఇక గ‌వ‌ర్న‌ర్ తో పాటు సీఎఈం ఉద్ద‌వ్ ఠాక్రేకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ఇదే విష‌యాన్ని ప్ర‌క‌టించారు కాంగ్రెస్ అబ్జ‌ర్వ‌ర్ క‌మ‌ల్ నాథ్. ఇదిలా ఉండ‌గా బీజేపీ మోర్చా నేత సీఎం కోవిడ్ రూల్స్ పాటించ లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

ఈ త‌రుణంలో శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut) గురువారం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవ‌రి బ‌లం ఏమిటో స‌భ‌లో తేలుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ఫ్లోర్ టెస్టు నిర్ణ‌యిస్తుంద‌న్నారు.

ఆ ఎమ్మెల్యేల‌పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ఒత్తిడి ఉంద‌ని , అయితే అసెంబ్లీలో ఎవ‌రు ఎవ‌రి వైపు ఉంటారో తేలుతుంద‌న్నారు.

మహారాష్ట్ర లో ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వం అస్థిర‌మైన స్థితిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ శివ‌సేన పార్టీ ఇంకా బ‌లంగానే ఉంద‌న్నారు సంజ‌య్ రౌత్(Sanjay Raut). తిరుగుబాటుదారులు దివంగ‌త బాలా సాహెబ్ థాక్రే నిజ‌మైన భ‌క్తులు మాత్రం కాద‌న్నారు .

Also Read : మ‌రాఠా సీఎంగా ఏక్ నాథ్ షిండే ..?

Leave A Reply

Your Email Id will not be published!