Sanjay Raut : హనుమాన్ చాలీసా వ్యవహారం మహారాష్ట్రను కుదిపేస్తోంది. ఇప్పటికే సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ ఆందోళన చేపట్టిన అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్ తో పాటు భర్త ఎమ్మెల్యే రవి రాణా ను అరెస్ట్ చేశారు.
వారిద్దరినీ 14 రోజుల పాటు కస్టడీకి కోర్టు విధించింది. ఈ సందర్బంగా హనుమాన్ చాలీసా పారాయణంపై సంచలన కామెంట్స్ చేశారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut ).
ఈ సందర్భంగా చాలీసా పఠించడం తప్పేమీ కాదన్నారు. అయితే ఇళ్ల ముందు చేస్తేనే ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులపై ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.
తీవ్రంగా విరుచుకు పడ్డారు. హనుమాన్ చాలీసా వల్ల ఎలాంటి ఇబ్బంది ఎవరికీ ఉండదన్నారు. మనసు చికాకుగా ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్న సమయంలో పఠించడంలో తప్పు లేదన్నారు.
ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం, ఇతరుల ఇళ్ల ముందు ఆందోళనలు, నిరసనలు చేపట్టడం మంచి పద్దతి కాదని సంజయ్ రౌత్ హితవు పలికారు.
ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా తమ ఇళ్లల్లో , మందిరాల్లో, ప్రార్థనా స్థలాల్లో చేసుకోవచ్చంటూ సూచించారు సంజయ్ రౌత్(Sanjay Raut ). ఇంకొకరి ప్రశాంత వాతారణాన్ని చెడగొట్టే అధికారం, హక్కు ఎవరికీ లేదన్నారు.
ప్రజలను కలిసి ఉండమంటూ చెప్పాల్సిన బీజేపీ చీఫ్ , మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తప్పు దోవ పట్టించడం దారుణమన్నారు. తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read : గిన్నిస్ రికార్డు సృష్టించిన త్రివర్ణ పతాకం