Sanjay Singh : మోదీ నిర్వాకం మణిపూర్ కు శాపం
నిప్పులు చెరిగిన ఎంపీ సంజయ్ సింగ్
Sanjay Singh : మణిపూర్ ఓ వైపు తగలబడి పోతుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నింపాదిగా నిద్ర పోతున్నారంటూ నిప్పులు చెరిగారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. గురువారం పార్లమెంట్ భవనంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. మోదీ సమాధానం చెప్పాలని కోరినందుకు రాజ్యసభ చైర్మన్ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) పై వేటు వేశారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రకటించారు. దీనిని నిరసిస్తూ 26 పార్టీలకు చెందిన ఎంపీలు సంజయ్ సింగ్ కు మద్దతు పలికారు.
Sanjay Singh Asking
ఈ సందర్భంగా సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రధానమంత్రిగా కొలువు తీరిన ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో దేశంలో అల్లర్లు, హింసాత్మక ఘటనలు, విద్వేషాలతో నిండి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచేలా మోదీ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు సంజయ్ సింగ్.
ఓ వైపు దేశంలో అంతర్భాగంగా ఉన్న మణిపూర్ కాలిపోతుంటే ఇప్పటి వరకు మౌనం ఎందుకు వహించారంటూ నిలదీశారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. పిల్లలు హత్యకు గురవుతున్నారు..కానీ బాధ్యత కలిగిన సీఎం నిద్ర పోతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read : Raghav Chadha : మణిపూర్ సర్కార్ ను బర్తరఫ్ చేయాలి