బెంగళూరు : కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయడమే కాకుండా కేవలం 5 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడిన కేరళ క్రికెటర్ సంజు శాంసన్ ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో 321 రన్స్ చేశాడు. టోర్నమెంట్ లో తనకు అరుదైన అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యాడు. ఇదే సమయంలో తను ఐపీఎల్ లో టాప్ స్కోరర్ జాబితాలో కూడా చోటు సంపాదించాడు. ఇదిలా ఉండగా ఈనెల 28వ తేదీ నుంచి అత్యంత జనాదరణ కలిగిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ ప్రారంభం కానుంది.
అయితే ఈసారి సంజు శాంసన్ కొన్నేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడడం లేదు. తనను ఏరికోరి తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ప్రస్తుతం ఆ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తుండగా వరల్డ్ కప్ లో సత్తా చాటిన మరో క్రికెటర్ శివమ్ దూబే కూడా సీఎస్కేలో జాయిన్ అవుతున్నాడు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు కుంబ్లే. రాబోయే రోజుల్లో తదుపరి సీఎస్కే వికెట్ కీపర్ గా శాంసన్ ఆడనున్నాడని, ఇప్పటికే గ్లవ్స్ ఇచ్చే పనిలో ధోనీ ఉన్నాడని పేర్కొన్నాడు. అంతే కాకుండా తను నాయకత్వ బృందంలో భాగంగా ఉంటాడని పేర్కొన్నాడు. రుతురాజ్ అందుబాటులో లేకపోతే కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్ట వచ్చని కూడా తెలిపాడు కుంబ్లే.