MS Dhoni Samson : శాంసన్ బెస్ట్ ఆఫ్ లక్ – ధోనీ
సంజూకు ప్రత్యేక అభినందన
MS Dhoni Samson : ఎదుటి వాళ్లను అభినందించడం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, ప్రత్యర్థుల ఆట తీరు బాగుంటే ప్రశంసించడంలో
భారత మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతే ఎవరైనా.
ప్రధానంగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో తన జట్టు 10 మ్యాచ్ లలో ఓడి పోయింది. నాలుగు మ్యాచ్ లలో గెలుపొంది. మొదటి మ్యాచ్ సీఎస్కే
రాజస్తాన్ రాయల్స్ తో ఆడింది.
ఆ మ్యాచ్ లో రాజస్తాన్ ఘన విజయాన్ని నమోదు చేసింది. చివరి 14వ మ్యాచ్ కూడా ఇదే జట్టుతో సీఎస్కే ఆడడం, ఉత్కంఠ భరితంగా
గేమ్ జరగడం, చివరకు 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది.
సీఎస్కే తరపున ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ దుమ్ము రేపాడు. 93 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ధోనీ 26 పరుగులు చేసినా ఫలితం లేక పోయింది.
కేవలం 150 రన్స్ మాత్రమే చేసింది. ఇక అనంతరం బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ చివరి దాకా పోరాడింది. ధోనీ ప్రత్యర్థి జట్టు మీద ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యాడు.
ఇదే సమయంలో పానీ పూరీ కుర్రాడు యశస్వి జైశ్వాల్ అద్భుతంగా రాణించాడు. 8 ఫోర్లు ఓ సిక్సర్ తో 59 పరుగులు చేసి సత్తా చాటాడు. అనంతరం బరిలోకి దిగిన స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కష్టాల్లో ఉన్న తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
40 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. విజయం అనంతరం ధోనీ అశ్విన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సందర్భంగా తన జట్టు ఓడి పోయి నిష్క్రమించినా క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు.
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్(MS Dhoni Samson) ను అభినందించాడు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు.
Also Read : వచ్చే ఐపీఎల్ లో చెన్నైకి నేనే కెప్టెన్