Sanju Samson Viral : సంజూ శాంస‌న్ క్రేజ్ అదుర్స్

ఐర్లాండ్ లో సైతం మ‌నోడికి ఫ్యాన్స్

Sanju Samson Viral : భార‌త క్రికెట్ జ‌ట్టులో స్టార్ హిట్ట‌ర్ గా పేరొందాడు కేర‌ళ క్రికెట‌ర్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్. భార‌త్ లో జ‌రిగిన ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రిచ్ లీగ్ ఐపీఎల్ లో 14 ఏళ్ల త‌ర్వాత త‌న సార‌థ్యంలో జ‌ట్టును ఫైన‌ల్ వ‌ర‌కు తీసుకు వెళ్లాడు.

బ్యాట‌ర్ గా రాణిస్తూనే నాయ‌కుడిగా త‌న స‌త్తా ఏపాటిదో చాటాడు. అయితే భార‌త జ‌ట్టులో చోటు ద‌క్క‌క పోవ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మైంది.

ఇటీవ‌లే భార‌త జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి సైతం శాంస‌న్ ను ఆస్ట్రేలియాలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడేందుకు తీసుకోవాల‌ని సూచించాడు బీసీసీఐకి.

ఈ త‌రుణంలో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని జ‌ట్టులో గ‌త్యంత‌రం లేక తీసుకున్నారు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ‌. ఇదే

స‌మ‌యంలో ఐర్లాండ్ టూర్ లో రెండు టి20 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా మొద‌టి టి20 లో ఆడించ లేదు.

రుతురాజ్ గాయ‌ప‌డ‌డంతో సంజూ శాంస‌న్ కు చాన్స్ ఇచ్చారు. సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న లో భాగంగా జ‌ట్టులో తిరిగి చోటు ద‌క్కించుకున్నాడు. ఈ స‌మ‌యంలో మ్యాచ్ కు ముందు కెప్టెన్ పాండ్యా టాస్ గెలిచాడు.

సంజూ శాంస‌న్ ను ఆడిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గానే స్టేడియంలో ఉన్న అభిమానులంతా హ‌ర్ష‌ధ్వానాల‌తో జేజేలు ప‌లికారు. దీంతో పాండ్యా

సైతం ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాడు. సంజూ శాంస‌న్(Sanju Samson)  కు ఇంత క్రేజ్ ఉంద‌ని తాను అనుకోలేద‌న్నాడు.

ఇక ఓపెనర్ గా బరిలోకి దిగిన కేర‌ళ స్టార్ ఐర్లాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో 77 ర‌న్స్ చేశాడు.

మొత్తంగా సంజూ క్రేజ్ తో కూడిన వీడియో(Sanju Samson Viral) ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చేస్తోంది. రాజస్తాన్ రాయ‌ల్స్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో వీడియో పోస్ట్ షేర్ చేసింది.

Also Read : సంజూ శాంస‌న్..హూడా అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!