Sanju Samson : సంజూ శాంసన్ అరుదైన రికార్డ్
రాజస్థాన్ రాయల్స్ తరపున బిగ్ స్కోరర్
Sanju Samson : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 42 రన్స్ చేశాడు. కానీ జట్టును గెలిపించక పోయినా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తన జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటి దాకా టాప్ స్కోరర్ గా ఉన్న అజింక్యా రహానేను అధిగమించాడు సంజూ శాంసన్(Sanju Samson).
కేవలం 25 బంతులు ఎదుర్కొన సంజూ 42 రన్స్ చేయడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ కోసం భారీ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం 106 మ్యాచ్ ల్లో 3,098 పరుగులు చేసిన అజింక్యా రహానే కంటే ఇప్పుడు శాంసన్ 118 మ్యాచ్ ల్లో 3,138 రన్స్ చేశాడు సంజూ శాంసన్.
అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున శాంసన్ , రహానేతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు లైన్ లో ఉన్నారు. షేన్ వాట్సన్ 84 మ్యాచ్ లు ఆడి 2,474 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ 60 మ్యాచ్ లు ఆడి 2,378 రన్స్ తో సత్తా చాటాడు.
ఆ తర్వాతి స్థానంలో ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ 52 మ్యాచ్ లు ఆడి 1,324 పరుగులతో ఆఖరులో ఉన్నాడు. ఏది ఏమైనా సంజూ శాంసన్(Sanju Samson) ఆడిన ఆట తీరు, కొట్టిన షాట్స్ కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఇదిలా ఉండగా తమ ఆటగాళ్లు చివరి దాకా పోరాడిన తీరు అద్భుతమన్నాడు స్కిప్పర్ సంజూ శాంసన్. ప్రత్యేకించి ధృవ్ జురెల్ , షిమ్రోన్ హిట్మెయర్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు. తర్వాతి మ్యాచ్ లలో సత్తా చాటుతామని స్పష్టం చేశాడు.
Also Read : కోల్ కతా బెంగళూరు నువ్వా నేనా