Sanju Samson : శాంస‌న్ ఔదార్యం క్రికెట‌ర్ల‌కు స‌హాయం

రూ. 2 కోట్ల‌కు పైగా వ‌ర్ధ‌మాన ఆట‌గాళ్ల‌కు ఆస‌రా

Sanju Samson : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ హాట్ టాపిక్ గా మారాడు. చాలా మంది క్రికెట‌ర్లు స్వంత సంపాద‌న‌పై ఫోక‌స్ పెడ‌తారు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క పెట్టుకోవాల‌ని అనుకుంటారు. కానీ కొంద‌రు క్రికెట‌ర్లు మాత్రం వెరీ స్పెష‌ల్. వాళ్ల‌తో పాటు ఇత‌ర ఆట‌గాళ్ల‌కు స‌హాయ ప‌డతారు. అలాంటి కోవ‌లోకి వ‌స్తాడు సంజూ శాంస‌న్.

తాజాగా శాంస‌న్ వ‌ర్ధ‌మాన ఆట‌గాళ్ల‌కు రూ. 2 కోట్ల‌కు పైగా ఆర్థిక సాయం చేశాడ‌ని కోచ్ బ‌య‌ట పెట్టాడు. దీంతో సోష‌ల్ మీడియాలో శాంస‌న్(Sanju Samson) లోని గొప్ప‌త‌నానికి, మాన‌వ‌తా దృక్ఫ‌థానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

మైదానంలో కానీ బ‌య‌ట కానీ ఎక్క‌డా ప‌ల్లెత్తు మాట వేరే వాళ్ల గురించి చెడుగా కామెంట్స్ చేయ‌డు. త‌న ప‌నేదో తాను ఉంటాడు. శాంస‌న్ ప్ర‌యారిటీ కుటుంబం, క్రికెట్. అది త‌ప్పితే వేరే ప‌ట్టించుకోడు. ఇత‌రుల జోలికి వెళ్ల‌డు. తాజాగా జ‌రిగిన ఐపీఎల్ టోర్నీలో ఆశించిన మేర రాణించ లేక పోయాడు.

ఇక ఐపీఎల్ లో ఆడుతున్నందుకు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్యం ఏకంగా ఫీజు కింద సంజూ శాంస‌న్ కు రూ. 15 కోట్లు చెల్లిస్తుంది. ఇందులోంచి భారీ ఎత్తున క్రికెట్ ఆడాల‌ని అనుకుంటున్న వాళ్ల‌కు స‌హాయం చేస్తుండడం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. అంద‌రూ శాంస‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Also Read : Congress Slams : అదానీ జ‌పం ఇంకెంత కాలం – కాంగ్రెస్

 

Leave A Reply

Your Email Id will not be published!