Danish Kaneria : సంజూ శాంసన్ అద్భుత ఆటగాడు – కనేరియా
అతడి ఎంపికపై వత్తిడికి గురైన బీసీసీఐ
Danish Kaneria : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా(Danish Kaneria) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాలో త్వరలో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో కేరళ స్టార్ సంజూ శాంసన్ ను ఎంపిక చేయక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు.
ఆస్ట్రేలియా పిచ్ లపై బౌలర్లను ఎదుర్కొనే సత్తా ఒక్క సంజూకే ఉందని పేర్కొన్నాడు. ఒక రకంగా సంజూ శాంసన్ బ్యాటింగ్ స్టైల్ , వికెట్ కీపింగ్ పర్ ఫెక్ట్ గా ఉంటుందని ప్రశంసించాడు.
ఇలాంటి ఆటగాడిని ఎందుకు పక్కన పెట్టారనేది తనకు అర్థం కావడం లేదన్నాడు. తన యూట్యూబ్ ఛానల్ లో సంజూ శాంసన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు డానిష్ కనేరియా.
వికెట్ కీపింగ్, హిట్టింగ్ విషయంలో బీసీసీఐ రిషబ్ పంత్ , దినేష్ కార్తీక్ ను పరిగణలోకి తీసుకున్నామని చెబుతోంది బీసీసీఐ. కానీ ఆ ఇద్దరి కంటే సంజూ శాంసన్ స్ట్రైక్ రేట్ టాప్ లో ఉందన్నాడు కనేరియా.
విచిత్రం ఏమిటంటే కనీసం రిజర్వ్ ఆటగాళ్లలో కూడా శాంసన్(Sanju Samson) ను ఎంపిక చేయక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్. ఇదిలా ఉండగా సంజూను ఎంపిక చేయక పోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి సెలెక్టర్లపై.
గత్యంతరం లేకనే శాంసన్ ను న్యూజిలాండ్ తో జరిగే వన్డే సీరీస్ కు భారత -ఎ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేసిందని పేర్కొన్నాడు కనేరియా. సంజూకు గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అతడి బ్యాటింగ్ శైలి సూపర్. ఆస్ట్రేలియాలో అతడిని మించిన ఆటగాడు లేడన్నాడు. ఒక రకంగా శాంసన్ కు ఇది మంచి అవకాశం.
తన సారథ్యంలో సీరీస్ గెలిస్తే అతడి భవిష్యత్తుకు ఢోకా ఉండదన్నాడు. సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది. 25, 27 తేదీల్లో తదుపరి మ్యాచ్ లు కొనసాగుతాయి.
Also Read : ఎంఐ ఎమిరేట్స్ హెడ్ కోచ్ గా షేన్ బాండ్