India A Team Squad : భారత-ఎ జట్టుకు సంజూనే సారథి
తలవంచిన బీసీసీఐ సెలెక్టర్లు
India A Team Squad : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్లు ఎట్టకేలకు తప్పు తెలుసుకున్నారు. చివరకు తాజా, మాజీ ఆటగాళ్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ క్రీడాభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కేరళ స్టార్ , రాజస్తాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ కు కెప్టెన్ గా ఛాన్స్ ఇచ్చారు.
ఈనెల 22 నుంచి న్యూజిలాండ్ తో ప్రారంభమయ్యే వన్డే సీరీస్ కు అతడిని సారథిగా ప్రకటించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరిగే టి20 సీరీస్ లో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ కంటే మెరుగైన ఆట తీరు కనబర్చినా సంజూ శాంసన్ ను ఎంపిక చేయడం, కనీసం రిజర్వ్ ఆటగాళ్లలో చేర్చక పోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
చివరకు భారత-ఎ జట్టుకు నాయకత్వం(India A Team Squad) వహించే అవకాశం దక్కించుకున్నాడు శాంసన్. స్టైలిష్ వికెట్ కీపర్ , బ్యాటర్ గా పేరొందని శాంసన్ సెప్టెంబర్ 22 నుంచి 27 మధ్య చెన్నైలో న్యూజిలాండ్ – ఎ తో జరిగే మూడు మ్యాచ్ ల వన్డే భారత – ఎ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
కుల్దీప్ యాదవ్ , పృథ్వీ షా , శార్దూల్ ఠాకూర్ , నవదీప్ సైనీతో సహా 16 మంది సభ్యులతో కూడిన జట్టులో అంతర్జాతీయ అనుభవం ఉంది. అండర్ =19 వరల్డ్ కప్ లో దుమ్ము రేపిన సీమర్ రాజ్ బావా కూడా జట్టుకు ఎంపికయ్యాడు.
ఇక ఇండియా – ఎ జట్టు ఇలా ఉంది. సంజూ శాంసన్ కెప్టెన్. పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటీదార్ , కేఎస్ భరత్ (వికెట్ కీపర్ ) , కుల్దీప్ యాదవ్ , షాబాజ్ అహ్మద్ , రాహుల్ చహర్ , తిలక్ వర్మ, కుల్దీప్ సేన్ , శార్దూల్ ఠాకూర్ , ఉమ్రాన్ మాలిక్ , నవదీప్ సైనీ , రాజ్ బావా ఉన్నారు.
Also Read : సంజూ శాంసన్ అద్భుత ఆటగాడు – కనేరియా