Sanju Samson : ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ కు సారథ్యం వహిస్తున్న సంజూ శాంసన్(Sanju Samson) బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్ తో మెరిశాడు. ప్రధానంగా ఈ రిచ్ లీగ్ లో నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠను కలుగ చేసింది.
ఒక రకంగా చెప్పాలంటే ఇరు జట్లు గెలుపు కోసం గట్టిగానే తలపడ్డాయి. కానీ అన్నింట్లోనూ సత్తా చాటుతూ వస్తున్న రాజస్థాన్ రాయల్స్ మాత్రం సత్తా చాటింది. తానే విజేతనని నిరూపించుకుంది.
ఏకంగా 15 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఇక కెప్టెన్ సంజూ శాంసన్ ఈసారి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఓ వైపు ఓపెనర్లు జోస్ బట్లర్ 116 పరుగులు చేసి రికార్డు సృష్టిస్తే మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ తరుణంలో బరిలోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
వచ్చిన ప్రతి బంతిని బౌండరీ, సిక్స్ కొట్టేందుకు ట్రై చేశాడు. పూర్తి పాజిటివ్ దృక్ఫథాన్ని కలిగి ఉండే ఈ స్టార్ ప్లేయర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే హెడ్ కోచ్ కుమార సంగక్కర ఓ మాటన్నాడు.
అదేమిటంటే ఈసారి వరల్డ్ కప్ లో శాంసన్ మెరుపులు కురిపించడం ఖాయమని. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేవలం 19 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సంజూ శాంసన్ 46 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇందులో 5 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. చేసిన పరుగుల్లో 46 పరుగుల్లో కేవలం ఫోర్లు, సిక్సర్లతో 38 రన్స్ వచ్చాయి.
Also Read : జార్ఖండ్ డైనమెట్ వల్లే ఓడి పోయాం