Sanju Samson : శాంస‌న్ కు గాయం శ్రీ‌లంక సీరీస్ కు దూరం

వెంటాడిన దుర‌దృష్టం..జితేష్ శ‌ర్మ ఆగ‌మ‌నం

Sanju Samson : కేర‌ళ స్టార్ బ్యాట‌ర్ , హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ ను దుర‌దృష్టం వెంటాడుతోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు జాతీయ జ‌ట్టుకు ఎంపిక కాకుండా వివ‌క్ష‌కు గుర‌య్యాడు. సోష‌ల్ మీడియాతో పాటు మాజీ క్రికెట‌ర్లు సైతం శాంస‌న్ కు జ‌రిగిన అన్యాయం గురించి ప్ర‌శ్నించారు. తాజాగా భార‌త్ లో కొన‌సాగుతున్న శ్రీ‌లంక టీ20 సీరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ.

కానీ వ‌న్డే సీరీస్ కు దూరం పెట్టింది. ముంబై వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్ లో కేవ‌లం 5 ప‌రుగులే చేశాడు..నిరాశ ప‌రిచాడు. ఫీల్డింగ్ చేస్తుండ‌గా తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో సంజూ శాంస‌న్(Sanju Samson) ను ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. ఈ మేర‌కు ముంబై లో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వైద్య బృందం ప‌రీక్షించింది. వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.

ఈ మేర‌కు వైద్య నిపుణులు శాంస‌న్ ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. లేక పోతే గాయం పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. దీంతో గాయం కార‌ణంగా టీ20 సీరీస్ కు దూరం కావ‌డంతో శాంస‌న్ స్థానంలో బీసీసీఐ జితేశ్ శ‌ర్మ‌ను ఎంపిక చేసింది. ఇక బౌండ‌రీ రోప్ వ‌ద్ద బంతిని ఫీల్డింగ్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో శాంస‌న్ ఎడ‌మ మోకాలికి గాయ‌మైంది.

మొద‌టి మ్యాచ్ లో భార‌త , శ్రీ‌లంక జ‌ట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోరాడాయి. చివ‌ర‌కు 2 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక ఓట‌మి పాలైంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 162 ర‌న్స్ చేసింది 20 ఓవ‌ర్ల‌లో. అనంత‌రం బ‌రిలోకి దిగిన లంక 160 ప‌రుగులే చేసింది. చివ‌రి బంతి వ‌ర‌కు మ్యాచ్ ఉత్కంఠ‌ను రేపింది.

Also Read : శస్త్ర చికిత్స కోసం పంత్ యుకేకు

Leave A Reply

Your Email Id will not be published!