Sanju Samson : ఎట్టకేలకు శాంసన్ కు ఛాన్స్
సౌతాఫ్రికా టూర్ కు ఎంపిక
Sanju Samson : ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సౌతాఫ్రికా టూర్ కు వెళ్లే భారత జట్టు స్క్వాడ్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా కేరళ స్టార్ క్రికెటర్ , రాజస్థాన్ రాయల్స్ టీం స్కిప్పర్ సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇచ్చింది. వరల్డ్ కప్ , ఆసిస్ టూర్ తో పాటు అంతకు ముందు భారత్ లో పర్యటించిన జట్లతో శాంసన్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది.
Sanju Samson Got a Chance
దీంతో పెద్ద ఎత్తున క్రికెట్ ఫ్యాన్స్ భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ కావాలని స్టార్ ఆటగాడిపై కరుణ చూపింది. చివరకు శాంసన్(Sanju Samson) ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా వెస్టిండీస్ లో ఈ ఏడాది ఆగస్టులో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.
ఇప్పటి వరకు సంజూ శాంసన్ టీమిండియా తరపున 13 వన్డేలు, 24 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వన్డే సీరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ. భారత జట్టు ఈనెలలో పూర్తి స్థాయి సీరీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళుతోంది. 3 టీ20 లు, 3 వన్డే మ్యాచ్ లు ఆడుతుంది. వీటితో పాటు 2 టెస్టు మ్యాచ్ లు జరుగుతాయి.
ఇక సంజూ శాంసన్ కు 29 ఏళ్లు. 2001లో క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. 55.71 సగటుతో 104.00 స్ట్రైక్ రేట్ తో 390 రన్స్ చేశాడు.
Also Read : Rinku Singh : మెరిసిన రింకూ సింగ్