IND vs SA 1st ODI : సంజూ శాంసన్ సెన్సేషన్ ఇన్నింగ్స్
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి
IND vs SA 1st ODI : కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ వీర విహారం చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకానొక దశలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న టీమిండియాకు వెన్నెముకలా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ , సంజూ శాంసన్ లు భారత జట్టుకు(IND vs SA 1st ODI) కీలకంగా నిలిచారు. పరువు పోకుండా కాపాడారు.
కళ్లు చెదిరే షాట్స్ తో కళాత్మకమైన రీతిలో ఫోర్లు, సిక్సర్లతో ఆకట్టుకున్నాడు శాంసన్. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది వన్డే మ్యాచ్.
ప్రేక్షకులకు అద్భుతమైన ఆనందాన్ని కలుగ చేసింది. ప్రత్యర్థి టీమ్ నుంచి డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ రెచ్చి పోతే టీమిండియా
తరపున సంజూ శాంసన్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఏకంగా 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. లక్నో వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగింది సఫారీ జట్టు. 250 పరుగుల టార్గెట్ ముందుంచింది. సంజూ శాంసన్(Sanju Samson) 63 బంతులు ఎదుర్కొని 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
శార్దూల్ ఠాకూర్ 31 బంతులు ఎదుర్కొని 33 రన్స్ చేశాడు.
ఆరో వికెట్ కు వీరిద్దరూ 93 రన్స్ చేశారు. వర్షం కారణంగా మ్యాచ్ ను 40 ఓవర్లకు తగ్గించారు. దీంతో పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు ప్లేయర్లు. టాప్ బ్యాటర్లు శిఖర్ ధావన్ 4, శుభ్ మన్ గిల్ 3, ఇషాన్ కిషన్ 20 , రుతురాజ్ గైక్వాడ్ 19 రన్స్ చేసి నిరాశ పరిచారు.
అనంతరం బరిలోకి దిగిన అయ్యర్ 50 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకు ముందు సఫారీ టీమ్ 4 వికెట్లు కోల్పోయి 249 రన్స్ చేసింది. మిల్లర్ 63 బంతులు ఆడి 74 రన్స్ చేశాడు. క్లాసెన్ 65 బంతులు ఆడి 74 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఐదో వికెట్ కు 139 పరుగులు
జోడించారు. ఆదివారం రాంచీలో రెండో వన్డే జరగనుంది.
Also Read : ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టం
#INDvSA | 1st ODI | LIVE UPDATES: Sanju Samson brings up his FIFTY
India need from 45 from 18 balls
(🎥: BCCI)#INDvsSA | #SanjuSamson pic.twitter.com/TdbhYkZsxR
— Cricket Buzz (@CricSportsBuzz) October 6, 2022