Sanju Samson Selection BCCI : బీసీసీఐ నిర్వాకం శాంస‌న్ కు అన్యాయం

ఇక ఐపీఎల్ కే ప‌రిమితం కానున్నాడా

Sanju Samson Selection BCCI : కేర‌ళ స్టార్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ ప‌ట్ల భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) త‌న వివ‌క్ష‌ను కొన‌సాగిస్తూనే ఉంది. గాయం నుంచి కోలుకున్నా అత‌డిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల జీటీవీ న్యూస్ నిర్వ‌హించిన స్టింగ్ ఆప‌రేష‌న్ లో బీసీసీఐ మాజీ సెలెక్ట‌ర్ చేత‌న్ శ‌ర్మ బ‌హిరంగంగానే అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. రాజ‌కీయాల‌కు బీసీసీఐ కేరాఫ్ గా మారింద‌ని తేలిపోయింది. ప్ర‌స్తుతం ముంబై , గుజ‌రాత్ లాబీయింగ్ జోరుగా కొన‌సాగుతోంది.

ఇక సంజూ శాంస‌న్ విష‌యంలో రాజ‌కీయ‌కంగా బ‌ల‌మైన స‌పోర్ట్ లేక పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. అటు టెస్టుల్లో ఘోరంగా విఫ‌ల‌మైనా కేఎల్ రాహుల్ ను ఆస్ట్రేలియాతో జ‌రిగే వ‌న్డే సీరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ(Sanju Samson Selection BCCI).

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్టార్ ప్లేయ‌ర్ వెంక‌టేశ్ ప్ర‌సాద్ షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు. కేఎల్ రాహుల్ ప‌ట్ల ఫెవ‌రేటిజం క‌నిపిస్తోంద‌ని, ఎంతో మంది ఆట‌గాళ్లు రాణిస్తున్నా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవడం లేద‌ని ఆరోపించారు. అంతే కాదు ఐపీఎల్ లో ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న లోక్నో జెయింట్స్ కార‌ణంగా జ‌ట్టులో కంటిన్యూ అవుతున్నాడ‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

ప్ర‌స్తుతం నోరు పారేసుకుని చీఫ్ సెలెక్ట‌ర్ ప‌ద‌వి నుండి త‌ప్పుకున్న చేత‌న్ శ‌ర్మ సంజూ శాంస‌న్ ఫ్యాన్స్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఒక‌ర‌కంగా త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కాడు. మొత్తంగా బీసీసీఐ పూర్తిగా శాంస‌న్ ప‌ట్ల వ్య‌తిరేక‌త‌తో ఉంద‌ని మాత్రం స్ప‌ష్ట‌మైంది. ర‌విశాస్త్రి చెప్పిన‌ట్లు ఒక ఆట‌గాడికి క‌నీసం 10 మ్యాచ్ ల‌లోనైనా ఛాన్స్ ఇవ్వాల‌ని అప్పుడే అత‌డి టాలెంట్ ఏమిటో తెలుస్తుంద‌ని స్ప‌ష్టం చేశాడు.

Also Read : పుజారాకు క‌మిన్స్ అరుదైన గిఫ్ట్

Leave A Reply

Your Email Id will not be published!