Sapna Aggarwal ANSA : క్రియేటివిటీలో సప్నా కిర్రాక్

డిజైన‌ర్ అండ్ క్రియేట‌ర్ రైట‌ర్

Sapna Aggarwal ANSA : ఇంటీరియ‌ర్ డిజైనింగ్ కు ఈమ‌ధ్య‌న ప్ర‌యారిటీ పెరిగింది. సప్నా అగ‌ర్వాల్(Sapna Aggarwal ANSA)  ఇండియాలో డిజైన‌ర్ గా గుర్తింపు పొందారు. ఏఎన్ఎస్ఏ ఆర్కిటెక్చ‌ర్ అండ్ ఇంటీరియ‌ర్స్ లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందారు. అంతే కాదు ర‌చ‌యిత‌గా కూడా ఫేమ‌స్ అయ్యారు. ఎ కాంప్రెహెన్సివ్ గైడ్ టు ఇంటీరియ‌ర్ డిజైనింగ్ పుస్త‌కాన్ని రాశారు.

స‌ప్నా అగ‌ర్వాల్ త‌న భ‌ర్త‌తో క‌లిసి 2002లో ఇంటీరియ‌ర్ డిజైనింగ్ ప‌ట్ల మ‌క్కువ‌తో అన్సా ఇంటీరియ‌ర్స్ ను ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఆమె అన్సాలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ , ది డ్రా ప్యాడ్ డిజైన్ ఇన్ స్టిట్యూట్ లో హెడ్ గా ఉన్నారు.

స‌ప్నా అగ‌ర్వాల్(Sapna Aggarwal) కాలేజీల్, సంస్థ‌ల‌ను సంద‌ర్శిస్తారు. ప్ర‌సంగాలు, వ‌ర్క్ షాప్ ల ద్వారా విద్యార్థుల‌కు బోధిస్తారు. త‌న అనుభ‌వాల‌ను పంచుకుంటారు. ఆమె శిక్ష‌ణ తీసుకున్న ఎంద‌రో విద్యార్థులు డిజైన‌ర్లుగా పేరు పొందారు. అనేక ఇంటీరియ‌ర్ డిజైనింగ్ కాలేజీల‌కు అతిథి స్పీక‌ర్ గా కూడా ప‌ని చేశారు.

గ‌త 20 ఏళ్లుగా విద్య‌, మార్కెట్ లో చోటు చేసుకున్న ప‌రిణామాలు, చోటు చేసుకున్న అంత‌రాన్ని త‌గ్గించ‌డంపై ఫోక‌స్ పెట్టారు స‌ప్నా అగ‌ర్వాల్. ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ల‌కు స‌హాయం కూడా చేస్తుంది. 2015, 2016, 2017 , 2018 సంవ‌త్స‌రాల‌లో వ‌రుస‌గా వివిధ సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో అవార్డులు పొందారు. ఐజెన్ టాప్ 50 ఆర్కిటెక్ట్ , డిజైన‌ర్స్ ల‌లో చోటు ద‌క్కించుకుంది.

దానితో పాటు ఆమె ఐఎన్ఐఎఫ్డీ ఎగ్జిబిష‌న్ సొసైటీ ఇంటీరియ‌ర్స్ డ్యూరియ‌న్ అవార్డ్స్ లో జ్యూరీకి న్యాయ‌మూర్తిగా వ్య‌వ‌హ‌రించారు. ఇది ఆమె ప‌నితీరుకు ద‌క్కిన గౌర‌వం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : జైబా సారంగ్ ఇథింక్ లాజిస్టిక్స్

Leave A Reply

Your Email Id will not be published!