Sarandeep Singh : టీమిండియాలో జోష్ క‌రువైంది

మాజీ సెలెక్ట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్

Sarandeep Singh : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ సెలెక్ట‌ర్ శ‌ర‌ణ్ దీప్ సింగ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఏకంగా ఆయ‌న ప్ర‌స్తుత హెడ్ కోచ్ పై సెటైర్ వేశారు. కోహ్లీ సార‌థ్యంలో ఉన్నంత స్పార్క్ ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌ని పేర్కొన్నాడు.

కోహ్లీ సార‌థ్యంలో టీమిండియా యుద్దానికి సిద్దంగా ఉన్న‌ట్టు ఉండేద‌ని, వీలైతే త‌ల‌ప‌డేందుకు రెడీగా ఉండేద‌న్నాడు. కానీ ఇప్పుడు ఆనాటి స్పార్క్, ఆ జోష్ ఎక్క‌డా క‌నిపించడం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఆ మెరుపు, ఆ దూకుడు ఎటు పోయింద‌ని ప్ర‌శ్నించాడు. ఇలాగైతే భార‌త జ‌ట్టు గెల‌వ‌డం క‌ష్ట‌మ‌న్నాడు. దీని వ‌ల్ల ఆట‌గాళ్ల‌లో పోరాడాల‌న్న త‌లంపు లేకుండా పోతే ప్ర‌మాద‌మ‌న్నాడు.

టెస్టుల్లోనే కాదు వ‌న్డేల్లో సైతం భార‌త జ‌ట్టు హాట్ ఫెవ‌రేట్ గా ఉండేద‌ని కానీ ఆట తీరు త‌ర్వాత ఆ న‌మ్మ‌కం ఏ ఒక్క‌రికీ క‌ల‌గ‌డం లేద‌న్నాడు. అస‌లు హెడ్ కోచ్ ఏం చేస్తున్నాడో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని పేర్కొన్నాడు శ‌ర‌ణ్ దీప్ సింగ్(Sarandeep Singh).

ఇప్ప‌టికే టెస్టు సీరీస్ తో పాటు వ‌న్డే సీరీస్ కూడా పోగొట్టుకున్నామ‌ని ఇక భార‌త్ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు క‌ల‌గ‌డం లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. కోహ్లీ ఎప్పుడూ ఎన‌ర్జ‌టిక్ గా దూకుడుగా ఉంటాడు.

కానీ కేఎల్ రాహుల్ అలా కాదు అత‌డు చాలా కూల్ గా ఉండేందుకే ఇష్ట ప‌డ‌తాడ‌న్నాడు. ఇలాగైతే జ‌ట్టులో స్ఫూర్తి అన్న‌ది కొర‌వ‌డే చాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని హెచ్చ‌రించాడు.

ఇదిలా ఉండ‌గా భార‌త జ‌ట్టు 287 ప‌రుగుల టార్గెట్ ముందుంచింది. కానీ సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ ఛేజ్ చేశార‌ని, వారిలో ఆ స్పార్క్ పోలేద‌న్నాడు.

Also Read : వేలం పాట‌కు వేళాయెరా

Leave A Reply

Your Email Id will not be published!