Sarfaraz Ahmed Wife : స‌ర్ఫ‌రాజ్ శ‌త‌కం భార్య భావోద్వేగం

ఎనిమిదేళ్ల త‌ర్వాత సెంచ‌రీ

Sarfaraz Ahmed Wife : కొన్నింటిని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. సాధార‌ణ అభిమానుల్లాగే ఆట‌గాళ్ల‌కు కూడా సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఒక్కోసారి వాటిని కంట్రోల్ చేసుకోవడం క‌ష్టం. ఆట‌గాళ్ల‌కు ప్ర‌ధానంగా స‌క్సెస్ సాధించిన‌ప్పుడు మ‌రింత ఉత్సాహంతో ఉర‌క‌లేయడం చూస్తాం. కానీ చాలా ఏళ్ల త‌ర్వాత ప‌ర్ ఫార్మెన్స్ తో అద‌ర‌గొడితే ఆ ఆనందం వ‌ర్ణించ లేం. స‌రిగ్గా అలాంటి అరుదైన స‌న్నివేశం పాకిస్తాన్ లో చోటు చేసుకుంది.

ప్ర‌పంచంలో ఇప్పుడు క్రికెట్ కు విప‌రీత‌మైన జ‌నాద‌ర‌ణ నెల‌కొంది. తాజాగా పాకిస్తాన్ , న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ అద్భుతంగా ఆడాడు. ఇది చివ‌రి టెస్టు. సెంచ‌రీతో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఈ శ‌త‌కం సాధించేందుకు మ‌నోడు కొన్నేళ్లు ఆగాల్సి వ‌చ్చింది.

భార‌త జ‌ట్టులో టాప్ హిట్ట‌ర్ గా ఉన్న విరాట్ కోహ్లీ రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి నానా తంటాలు ప‌డ్డాడు. ఇప్పుడు మ‌ళ్లీ గాడిలో ప‌డ్డాడు. సేమ్ వాతావ‌ర‌ణం స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ది కూడా. ఇక ఈ టెస్టులో జ‌ట్టు 77 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో జ‌ట్టును ఆదుకున్నాడు. అడ్డుగోడ‌లా నిలిచాడు.

న్యూజిలాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. మొత్తం 176 బంతులు ఎదుర్కొని 118 ప‌రుగులు చేశాడు. ఇక నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఎనిమిది సంవ‌త్స‌రాల త‌ర్వాత సెంచ‌రీ చేశాడు. దీంతో ఫ్యామిలీ మెంబ‌ర్స్ , అభిమానులు, భార్య భావోద్వేగానికి(Sarfaraz Ahmed Wife) లోన‌య్యారు.

Also Read : క‌దం తొక్కిన సూర్యా భాయ్

Leave A Reply

Your Email Id will not be published!