Sarfaraz Khan : సర్ఫరాజ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
సెలెక్షన్ కమిటీ నిర్వాకంపై ఫైర్
Sarfaraz Khan : భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ నిర్వాకంపై మరోసారి చర్చకు దారి తీసింది. దేవీవాళి క్రికెట్ లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు కనబరుస్తూ వస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan). ఇదే సమయంలో భారత్ లో పర్యటించే ఆస్ట్రేలియా జట్టుతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్ లకు జట్టును ప్రకటించింది బీసీసీఐ.
ఇప్పటికే కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టింది. దీనిపై పెద్ద రాద్దాంతం జరిగింది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున బీసీసీఐని, సెలెక్టర్లను తప్పు పట్టారు. ఇటీవల జరిగిన రంజీ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.
ఏకంగా ఎంచరీ సాధించాడు. కానీ తుది జట్టులో ఎంపిక కాలేదు. దీనిపై తాజా, మాజీ ఆటగాళ్లు సైతం సెలెక్షన్ కమిటీ ఎంపిక వివక్షను ప్రశ్నించారు. భారత జట్టు ప్రకటించిన మూడు రోజుల తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా సర్ఫరాజ్ తన గైర్హాజర్ పై మౌనం వీడాడు.
తనను మినహాయించడంపై స్పందించాడు. సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మతో కూడా తాను కలిసినట్లు పేర్కొన్నాడు. వచ్చే నెలలో జరిగే ఆసిస్ తో జరగనున్న మొదటి, రెండు టెస్టులకు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) ను ఎంపిక చేయలేదు. అనలిస్ట్ లు , వెటరన్ క్రికెటర్లు బిగ్ షాక్ కు గురయ్యారు.
25 ఏళ్ల వయస్సు కలిగిన ఖాన్ ఇప్పటి దాకా రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రతిభను కనబర్చాడు. గత సీజన్ లో 982 రన్స్ చేశాడు. అద్భుతంగా రాణిస్తున్నా పక్కన పెట్టారంటూ వాపోయాడు సర్ఫరాజ్ ఖాన్.
Also Read : దంచి కొట్టిన కోహ్లీ చెలరేగిన గిల్