Satya Pal Malik Comment : మంటలు రేపిన ‘మాలిక్’
మోదీ..అమిత్ షా పై కామెంట్స్
Satya Pal Malik Comment : ఎవరీ సత్యపాల్ మాలిక్. ఎందుకు ఆయన గురించి ఇంతలా చర్చ జరుగుతోంది. ఇవాళ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ట్రుబల్ షూటర్ అమిత్ షా గురించి ఏదైనా మాట్లాడాలంటే జడుసుకునే పరిస్థితి. కానీ ఆక్టోపస్ లా విస్తరించిన భారతీయ జనతా పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు ట్రబుల్ షూటర్ షా.
కాషాయ త్రయాన్ని (మోదీ, షా, జేపీ నడ్డా) తట్టుకుని కొన్ని గొంతుకలు అప్పుడప్పుడు వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ కాగా మరొకరు ఎంపీ వరుణ్ గాంధీ. మోదీ నియంతృత్వ ధోరణి పార్టీకి మంచిది కాదని ముఖ్యంగా దేశానికి ప్రమాదమని హెచ్చరించారు సత్య పాల్ మాలిక్. ఇదే సమయంలో పుల్వామా దాడికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ సమయంలో మాలిక్(Satya Pal Malik) జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. తాను విమానం పంపాలని కోరానని కానీ పీఎం పట్టించు కోలేదని , దీని వల్ల 40 మంది జవాన్లు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారకుడు ప్రధానమంత్రి అని ఆరోపణలు చేశారు.
ఇక సత్య పాల్ మాలిక్ ఇప్పుడే కాదు ఆయన సత్యాన్ని పలకడంలో ముందంజలో ఉన్నారు. అన్యాయం జరిగితే దానిని ఒప్పుకునే రకం కాదు. ఎవరు ఏమన్నా అనుకోని తాను మాత్రం బాధితుల పక్షాన ఉంటానని ప్రకటించారు.
పదవిలో ఉన్నా కూడా బంధనాలు తెంచుకుని పేదల పక్షాన తన వాయిస్ వినిపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన విరోచిత పోరాటానికి బహిరంగంగా మద్దతు తెలిపారు సత్యపాల్ మాలిక్. ఆయన పేరులోనే సత్యం ఉంది. నిజాయితీ ఉంది.
తన పార్టీకి చెందిన వారిపై కూడా ఆరోపణలు చేసేందుకు వెనుకాడ లేదు. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు మురళీధర్ రావు రిలయన్స్ కాంట్రాక్టుకు సంబంధించి సంతకం చేయాలని కోరుతూ తన వద్దకు వచ్చాడని దానిని తిప్పి పంపించానని బాంబు పేల్చాడు.
ఇదిలా ఉండగా ప్రధాని మోదీ మతి స్థిమితం కోల్పోయారంటూ అమిత్ షా తనతో చెప్పారంటూ మాలిక్ చెప్పడం కలకలం రేపింది. రైతుల విషయంలో నా స్టాండ్ మారలేదు. చివరకు మోదీ దిగిరాక తప్పలేదన్నాడు. రైతుల వల్లనే ఇవాళ నువ్వు రాజువు అయ్యామని ప్రధానితో తాను చెప్పానన్నారు మాలిక్. పుల్వామా ఆత్మాహుతి దాడికి కేంద్ర సర్కార్ నిర్లక్ష్యమే కారణమని సంచలన ఆరోపణలు చేశారు మాజీ గవర్నర్.
సైనికుల తరలింపు కోసం సీఆర్పీఎఫ్ కు విమానాలను ఇవ్వడాన్ని హోం మంత్రిత్వ శాఖ తిరస్కరించిందని సత్య పాల్ మాలిక్(Satya Pal Malik Comment) సంచలన ఆరోపణలు చేశారు. విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం కొలువు తీరిన రాష్ట్రపతిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెను కలవాలంటే పీఎంఓ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నాడు.
మొత్తంగా మాలిక్ మాటలు కాషాయంలో కలకలం రేపాయి. దీనికి జవాబు చెప్పాల్సింది ఇద్దరే ఒకరు ప్రధాన మంత్రి మోదీ..మరొకరు ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షా.
Also Read : దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయి