Savitri Jindal : ఆసియా ధనవంతురాలిగా సావిత్రి జిందాల్
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడి
Savitri Jindal : నిన్నటి దాకా ఆసియా ఖండంలో అత్యంత ధనవంతురాలిగా ఉన్న చైనాకు చెందిన యాంగ్ హుయాన్ ను వెనక్కి నెట్టేసింది భారత్ కు చెందిన సావిత్రి జిందాల్. తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసింది.
ఆసియాలోనే టాప్ రిచెస్ట్ విమెన్ గా నిలిచారని ప్రకటించింది. చైనాలో చోటు చేసుకున్న రియల్ ఎస్టేట్ సంక్షోభం హుయాన్ ను వెనక్కి నెట్టేసేలా చేసింది. తను టాప్ స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చినా ఫలితం లేక పోయింది.
ఆమెను దాటేసి ముందుకు వచ్చిన భారత్ కు చెందిన సావిత్రి జిందాల్ సంపద 11.3 బిలియన్లు. ఆమె లోహాలు, విద్యుత్ ఉత్పత్తితో సహా పలు రంగాలలో కీలక పరిశ్రమలు కలిగి ఉన్న జిందాల్ గ్రూప్ కు గౌరవ చైర్ పర్సన్ గా ఉన్నారు సావిత్రి జిందాల్.
72 ఏళ్ల సావిత్రి జిందాల్ దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా పేరొందారు. 1.4 బిలియన్లతో దేశంలో 10వ ధనవంతురాలిగా స్థానం పొందారు. ఆమె భర్త , వ్యవస్థాపకుడైన ఓపీ జిందాల్ 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
భర్త లేని లోటును సావిత్రి జిందాల్ (Savitri Jindal) పూడ్చారు. జిందాల్ గ్రూప్ సంస్థలకు సారథ్య బాధ్యతలు స్వీకరించారు. ఆయా కంపెనీలన్నీ ఇప్పుడు ఆమె కనుసన్నలలో నడుస్తున్నాయి.
జిందాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉక్కు, సిమెంట్, ఇంధనం, మౌలిక సదుపాయాల కల్పనపై పని చేస్తున్నాయి. కరోనా కారణంగా కొంత ఒడిదుడుకులకు లోనైనా ఆ తర్వాత పుంజుకుంది.
ఏప్రిల్ 2022లో $15.6 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో మహిళలు హవా కొనసాగుతోంది. తాజాగా ప్రకటించిన భారత్ లో రిచెస్ట్ మహిళగా హెచ్ సీఎల్ చైర్ పర్సన్ రోష్నీ నాడర్ ఎంపికయ్యారు.
ఇప్పుడు సావిత్రి జిందాల్ ఆసియాలో టాప్ లో నిలిచారు. ఇక భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కొలువు తీరారు.
Also Read : న్యాయ సౌలభ్యం అత్యంత ముఖ్యం – మోదీ