Bilkis Bano : బిల్కిస్ బానో రేపిస్టుల విడుద‌ల‌పై విచార‌ణ

గుజ‌రాత్ స‌ర్కార్ కు కేంద్ర ప్ర‌భుత్వం బాస‌ట

Bilkis Bano : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది గుజ‌రాత్ కు చెందిన బిల్కిస్ బానో(Bilkis Bano) అత్యాచారం కేసు. ఈ కేసులో జీవిత ఖైదు అనుభ‌విస్తున్న 11 మంది ఖైదీల ప్ర‌వ‌ర్త‌న బాగుందంటూ గుజ‌రాత్ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చిన ఆగ‌స్టు 15వ రోజు విడుద‌ల చేసింది.

దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఆరు వేల మందికి పైగా మ‌హిళ‌లు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి నోటీసు జారీ చేసింది సుప్రీంకోర్టు. 14 ఏళ్లుగా జైలులో ఉన్నందు వ‌ల్ల , వారి ప్ర‌వ‌ర్త‌నలో మార్పు వ‌చ్చింద‌ని అందుకే తాము వారిని విడుద‌ల చేసిన్ట‌లు ప్ర‌భుత్వం పేర్కొంది.

ఆనాడు అమాయ‌క‌త్వంతో రేప్ కు పాల్ప‌డ్డార‌ని, హ‌త్య చేశార‌ని కానీ జైలులో ఉన్న కాలంలో ప్ర‌వ‌ర్త‌న బాగుంద‌ని కితాబు ఇచ్చింది స‌ర్కార్. ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం సూప‌ర్ అంటూ కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ నిర్ణ‌యంపై నిర‌స‌న వ్య‌క్త‌మైంది. బిల్కిస్ బానో(Bilkis Bano) 21 ఏళ్ల గ‌ర్భ‌వ‌తిగా ఉన్న స‌మ‌యంలో సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

ఆపై ఆమె కుటుంబానికి సంబంధించిన వారిని క‌ళ్ల ముందే దారుణంగా హ‌త్య చేశారు. బ‌ల‌మైన అభ్యంత‌రాలు ఉన్న‌ప్ప‌టికీ త్వ‌ర‌గా విడుద‌ల చేసేందుకు కేంద్రం, గుజ‌రాత్ వేగంగా ట్రాక్ చేశాయంటూ ప‌త్రం వెల్ల‌డించింది. దాఖ‌లైన పిటిష‌న్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారించ‌నుంది.

గుజ‌రాత్ ప్ర‌భుత్వం చేసిన అభ్య‌ర్థ‌న మేర‌కు రెండు వారాల్లోగా దోషుల విడుద‌ల‌కు కేంద్ర హొం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

Also Read : ఛాన్స్ ఇస్తానంటూ వాడుకున్నాడు

Leave A Reply

Your Email Id will not be published!