Karishma Tanna : ‘స్కూప్’ సూప‌ర్ క‌రిష్మా అదుర్స్

దుమ్ము రేపుతున్న వెబ్ సీరీస్

Karishma Tanna : జ‌ర్న‌లిస్ట్ నేప‌థ్యంలో నెట్ ఫ్లిక్స్ లో వ‌చ్చిన స్కూప్ వెబ్ సీరీస్ దుమ్ము రేపుతోంది. ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప చేసేలా చేస్తోంది. రేటింగ్స్ విష‌యంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది ఈ సీరీస్. ప్ర‌ధానంగా ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించిన క‌రిష్మా త‌న్నా న‌ట‌న సింప్లీ సూప‌ర్. ఆమె న‌ట‌న‌కు ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ అయితే ఇంత బాగా న‌టించిన క‌రిష్మాను ఎందుకు సినిమాల్లో తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తున్నారు.

ముంబై క్రైమ్ జ‌ర్న‌లిస్ట్ జ్యోతిర్మ‌య్ డే హ‌త్య‌కు గురైన 12వ వార్షికోత్స‌వానికి ముందు స్కూప్ వెబ్ సీరీస్ ను నెట్ ఫ్లిక్స్ ప్ర‌సారం చేసింది. చిత్ర నిర్మాత హ‌న్స‌ల్ మెహ‌తా ఈ సీరీస్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విడుద‌లైన కొద్ది నిమిషాల్లోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో వాడిన డైలాగులు దుమ్ము రేపేలా ఉన్నాయి. మాఫియా, క్రైమ్ , మీడియా ఇలా ప్ర‌తి అంశాన్ని బుల్లి తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు.

ఇదిలా ఉండ‌గా డే దారుణ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుల్లో ఒక‌రైన మాజీ జ‌ర్న‌లిస్ట్ జిగ్నా వోరా రాసిన బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా – మై డేస్ ఇన్ ప్రిజ‌న్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఇందులో క‌రిష్మా త‌న్నా(Karishma Tanna), మ‌హ్మ‌ద్ జీష‌న్ అయ్యూబ్ , ప్రొసెంజిత్ ఛ‌ట‌ర్జీ, హ‌ర్మ‌న్ బ‌వేజా , ఛ‌ట‌ర్జీ, భోజానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. అంద‌రి కంటే జ‌ర్న‌లిస్టుగా క‌రిష్మా త‌న్నా న‌ట‌న వంద శాతం న్యాయం చేసింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా స్కూప్ వెబ్ సీరీస్ చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

Also Read : Allu Sneha Reddy Wishes : అల్లు స్నేహా రెడ్డి వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!