Om Prakash Rajbhar : ఓం ప్ర‌కాశ్ రాజ్ భ‌ర్ కు సెక్యూరిటీ పెంపు

వై కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పిస్తూ కేంద్రం ఆదేశం

Om Prakash Rajbhar : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ సంకీర్ణ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ద్రౌప‌ది ముర్ముకు బేష‌ర‌తు మ‌ద్ద‌తు తెలిపారు యూపీకి చెందిన ఎస్పీ మిత్రుడు సుహేల్ దేవ్ భార‌తీయ స‌మాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) చీఫ్ ఓం ప్ర‌కాశ్ రాజ్ భ‌ర్ .

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ముప్పు వాటిల్ల‌నుంద‌ని నిఘా వ‌ర్గాల సూచ‌నల మేర‌కు కేంద్రం అద‌నంగా భ‌ద్ర‌త పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మేర‌కు ఓం ప్ర‌కాశ్ రాజ్ భ‌ర్ కు వై క్యాటిగిరీ భ‌ద్ర‌త క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా ఓప రాజ్ భ‌ర్ మాత్రం త‌మ పార్టీ ఇప్ప‌టికీ స‌మాజ్ వాది పార్టీతోనే పొత్తు కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ‘

ఆయ‌న అఖిలేష్ యాద‌వ్ కు కీల‌క మిత్రుడిగా ఉన్నారు. కాగా రాజ్ భ‌ర్ కు వై భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొంది కేంద్రం.

ఇదిలా ఉండ‌గా ఓం ప్ర‌కాశ్ రాజ్ భ‌ర్ కూడా దేశ 15వ రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకునేందుకు ఎన్నిక‌ల కంటే ముందు ట్ర‌బుల్ షూట‌ర్ కేంద్ర మంత్రి అమిత్ షాను ప్ర‌త్యేకంగా క‌లిశారు ఓం ప్ర‌కాశ్ రాజ్ భ‌ర్

గ‌త వారం అమిత్ షా, ద్రౌప‌ది ముర్ముతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi) రాజ్ భ‌ర్ ను మద్ధ‌తు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేర‌కు ప్ర‌తిప‌క్షం అయిన‌ప్ప‌టికీ అధికార పక్ష‌పు అభ్య‌ర్థికు తాను ఓటు వేశారు.

ఆయ‌న వేసిన ఎత్తుగ‌డ యూపీలో ప్ర‌తిప‌క్ష కూట‌మిలో చీలిక‌ల‌కు దారి తీసింది. ఆదివాసీ గిరిజ‌న బిడ్డ అయినందు వ‌ల్లే తాను మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని ఓం ప్ర‌కాశ్ రాజ్ భ‌ర్ (Om Prakash Rajbhar) చెప్పారు. అంత‌కు ముందు రాజ్ భ‌ర్ బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్నాడు.

Also Read : నిన్న అస‌మ్మ‌తి స్వ‌రం నేడు అధికార‌ప‌క్షం

Leave A Reply

Your Email Id will not be published!