Salman Khan Security : సల్మాన్ ఖాన్ కు భద్రత పెంపు
గ్యాంగస్టర్ బెదిరింపుతో వై ప్లస్
Salman Khan Security : ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు రావడం కలకం రేపింది. రవి బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ఘటనకు పాల్పడింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్ కు సెక్యూరిటీ(Salman Khan Security) కల్పించింది. గతంలో తనను, తండ్రిని చంపేస్తామంటూ లేఖ రాశారు.
దీనిని ఆధారంగా చేసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. సల్మాన్ ఖాన్ స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. అప్పటికప్పుడు ఎక్స్ కేటగిరీ కింద సెక్యూరిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తాజాగా మరోసారి బెదిరింపులు రావడంతో ఈసారి ఎక్స్ నుంచి వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైకి చెందిన ప్రొటెక్షన్ బ్రాంచ్ సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచాలని నిర్ణయించింది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ జాబితాలో ప్రధానంగా కండల వీరుడి పేరు ఉండడం విశేషం. మనోడికి జింకలు అంటే ఎంతో అభిమానం. షూటింగ్ సమయంలో జింకను వేటాడి చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు సల్మాన్ ఖాన్.
ఏరోజైనా తాను సల్మాన్ ఖాన్ ను చంపి తీరుతానంటూ శపథం కూడా చేశాడు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫఢ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కు కూడా వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో స్వయం రక్షణ కోసం లైసెన్స్ కలిగిన వెపన్ ను మంజూరు చేసింది ముంబై పోలీసు శాఖ. ‘ఏది ఏమైనా సినిమాల్లో విలన్లను చంపే హీరోకు సెక్యూరిటీ ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
Also Read : మార్కెట్ లోకి డిజిటల్ రూపాయి