Sedition Law : దేశ ద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే
తీర్పు చెప్పే దాకా కేసులు వద్దు
Sedition Law : సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన రాజద్రోహం చట్టం(Sedition Law) కేసుకు సంబంధంచి బుధవారం సంచలన ప్రకటన చేసింది.
దేశ ద్రోహం చట్టం(Sedition Law) పై తుది తీర్పు వెలువరించేంత వరకు స్టే విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది. ఇప్పటికే దేశ ద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించ వచ్చని సూచించింది.
తాజాగా దేశంలో ఈ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లయితే , అభియోగాలు మోపబడిన వారు కోర్టును నిరభ్యంతరంగా ఆశ్రయించ వచ్చని స్పష్టం చేసింది.
ప్రభుత్వం తన సమీక్షను పూర్తి చేసేంత వరకు దేశ ద్రోహ చట్టం తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది ధర్మాసనం.
దేశ ద్రోహం చట్టాన్ని పునః పరిశీలించే సమయంలో పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను ఉపసంహరించు కుంటామని, మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా పఠించడంపై అమలు చేసిన కేసులలో చట్టాన్ని దుర్వియోగం చేశారంటూ పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిని కూడా కోర్టు ప్రస్తావించింది. మళ్లీ పునః పరిశీలన ముగిసే వరకు ఈ చట్టంలోని రూల్ ను ఉపయోగించక పోవడమే ఉత్తమం.
124 ఏ (విద్రోహ చట్టం ) కింద ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేంద్రం, రాష్ట్రాలు విరమంచుకుంటాయని తాము ఆశిస్తున్నట్లు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసేందుకు యూనియన్ ఆఫ్ ఇండియాకు స్వేచ్ఛ ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
Also Read : కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు