Shafali Verma : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ తాజాగా వరల్డ్ వైడ్ గా టీ20 వుమెన్స్ (మహిళల) ర్యాంకింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇదిలా ఉండగా మొదటిసారిగా భారతీయ వుమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ (Shafali Verma)అరుదైన ఘనతను సాధించింది.
అద్భుతమైన ప్రతిభతో ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఏకంగా టాప్ వన్ లో నిలిచి చరిత్ర సృష్టించింది. షఫాలీ వర్మ 726 పాయింట్లతో తొలిసారి అగ్ర స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే 2021 ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వంతం చేసుకున్న మరో భారతీయ వుమెన్ క్రికెటర్ స్మృతి మందాన 709 పాయింట్లతో నాలుగో స్థానంతో నిలిచింది.
ఇక ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్ బ్యాటర్ బెత్ మూనీ 724 పాయింట్లతో రెండో ప్లేస్ తో సరి పెట్టుకుంది. స్వదేశంలో ఇంగ్లండ్ టీమ్ తో సీరీస్ లో టీ20 మ్యాచ్ లో దుమ్ము రేపి 64 పరుగులు చేసిన ఆసిస్ స్కిప్పర్ మెగ్ లానింగ్ 714 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.
ఆల్ రౌండర్ మెక్ గ్రాత్ 91 పరుగులతో దుమ్ము రేపిన 28వ ప్లేస్ కు చేరింది. ఇదిలా ఉండగా శ్రీలంక బ్యాటర్ చమేరీ అటపట్టు ఆల్ రౌండ్ విభాగంలో టాప్ 10 లో నిలిచింది.
బ్యాటింగ్ పరంగా 8వ స్థానంలో ఉండగా ఆల్ రౌండ్ ప్లేస్ లో ఏడో స్థానంతో సరి పెట్టుకుంది. ఆల్ రౌండ్ విభాగంలో 370 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.
ఇంగ్లండ్ ప్లేయర్ సీవర్ 352 పాయింట్లతో ద్వితీయ స్థానానికి ఎగ బాకింది. ఇక మొత్తంగా షఫాలీ వర్మ మాత్రం టాప్ లో నిలవడంతో బీసీసీఐ ఆమెకు కంగ్రాట్స్ తెలిపింది.
Also Read : అవకాశాలు సరిగా వాడుకోలేదు