Shah Rukh Khan : యూఏఈ టీ20 లీగ్ లో బాద్ షా ఎంట్రీ

మ‌రో లీగ్ ద‌క్కించుకున్న కేకేఆర్

Shah Rukh Khan : వ‌ర‌ల్డ్ క్రికెట్ లో ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టికే అత్యంత ఆదాయం క‌లిగిన లీగ్ గా పేరొందింది. కేవ‌లం ప్ర‌సార హ‌క్కుల ద్వారానే బీసీసీఐకి రూ. 50 వేల కోట్లు స‌మ‌కూరనున్నాయి.

ఇది క్రీడా రంగ చ‌రిత్ర‌లో ఓ రికార్డ్ . ఇప్ప‌టి వ‌ర‌కు 14 సీజ‌న్స్ పూర్తి కాగా 15వ సీజ‌న్ న‌డుస్తోంది.

అర‌బ్ వేదిక‌గా ఇప్ప‌టికే టీ10 పేరుతో లీగ్ లు కొన‌సాగుతున్నాయి. సీనియ‌ర్లతో కూడా ఓ లీగ్ కొన‌సాగింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా రిటైర్మెంట్ అయిన ఆటగాళ్ల‌తో టోర్నీ చేప‌ట్టింది. ఇక అమెరికా లాంటి దేశం కూడా ఇప్పుడు క్రికెట్ వైపు చూస్తోంది.

త్వ‌ర‌లో బీసీసీఐ మ‌హిళ‌ల కోసం ఐపీఎల్ టోర్నీ చేప‌ట్టాల‌ని డిసైడ్ అయింది.

ఈ విష‌యాన్ని బీసీసీఐ చీఫ్ దాదా ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. తాజాగా యూఏఈ వేదిక‌గా కొత్త‌గా టీ20 లీగ్ ప్రారంభం కానుంది.

ఇందు కోసం ఐపీఎల్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ య‌జ‌మానిగా ఉన్న బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)  కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇప్ప‌టికే కేకేఆర్ కో య‌జ‌మానిగా ఉన్న బాద్ షా(Shah Rukh Khan)  తాజాగా యూఏఈ వేదిక‌గా జ‌రిగే రిచ్ లీగ్ లో

ఓ ఫ్రాంచైజీని తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని అధికారికంగా కేకేఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది.

కొత్త ఫ్రాంచైజీకి అబుదాబి నైట్ రైడ‌ర్స్ అని పేరు ఖ‌రారు చేసింది. మ‌రో న‌టి జూహ్లీ చావ్లా, షారుఖ్ ఖాన్ క‌లిసి 2008లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ను కొనుగోలు చేశారు.

ఆనాటి నుంచి ఐపీఎల్ కు వారే య‌జ‌మానులుగా ఉన్నారు. ఈసారి ఐపీఎల్ వేలం పాట‌లో జూహ్లీ చావ్లా కూతురు,

షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)  కొడుకు క‌లిసి పాల్గొన‌డం సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది.

 

Also Read : బీసీసీఐపై బీజేపీదే పెత్త‌నం

Leave A Reply

Your Email Id will not be published!