Shahrukh Khan Jawan : పిచ్చెక్కిస్తున్న ‘బాద్ షా’

అట్లీ జ‌వాన్ పోస్ట‌ర్ వైర‌ల్

Shahrukh Khan Jawan : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇప్ప‌టికే బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనేతో క‌లిసి తీసిన ప‌ఠాన్ బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 1,000 కోట్లు క్రాస్ చేసింద‌ని అంచ‌నా. ఆ సినిమా త‌ర్వాత మ‌రింత జోష్ పెంచేలా డైన‌మిక్ , యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారుక్ ఖాన్ , న‌య‌న‌తార ప్ర‌ధాన తార‌గ‌ణంతో వ‌స్తోంది జ‌వాన్(Jawan).

ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి పోస్టర్స్ దుమ్ము రేపుతున్నాయి. ప్ర‌ధానంగా అట్లీ త‌ల‌ప‌తి విజ‌య్ తో తీసిన సినిమా దుమ్ము రేపింది. అత‌డి టేకింగ్, మేకింగ్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. అట్లీతో పాటు నెల్స‌న్ రాజ్ కుమార్ కూడా మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ . తాజాగా స‌ల్మాన్ ఖాన్ న‌టించిన జ‌వాన్ సినిమాలోని ఓ పోస్ట‌ర్ సోమ‌వారం నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. ఇది ట్రెండింగ్ లో నిలిచింది.

షారుఖ్ ఖాన్ కు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. అత‌డు ద‌ర్శ‌కుల‌కు కావాల్సిన న‌టుడు అన్నాడు డైరెక్ట‌ర్ అట్లీ. ప్ర‌ధానంగా అట్లీకి విజ‌య్ అంటే ప్రాణం. కానీ ఉన్న‌ట్టుండి అట్లీ లోని టాలెంట్ ను గుర్తించడంతో వెంట‌నే సినిమా చేసేందుకు ఒప్పేసుకున్నాడు షారుఖ్ కాన్. త‌న భార్య తో క‌లిసి జ‌వాన్ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ట్రైల‌ర్ , పోస్ట‌ర్స్ పిచ్చెక్కిస్తున్నాయి.

Also Read : Revanth Reddy : రేవంత్ రెడ్డి కామెంట్స్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!