Shakeera : ఎవరీ షకీరా అనుకుంటున్నారా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహించే మిసెస్ ఇండియా తెలంగాణ 2021 సంవత్సరానికి రన్నరప్ గా నిలిచారు. అరుదైన ఘనతను స్వంతం చేసుకున్నారు.
ఆమె స్వస్థలం ఖమ్మం. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. అయినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ఉన్నత చదవులు చదివారు. ప్రతి ఒక్కరు చదువు కోవాలన్నదే ఆమె ఆశ. ఆశయం కూడా.
తన భర్త జాబ్ నిమిత్తం ఆమె అమెరికా వెళ్లారు. అక్కడ కొన్నాళ్లు ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ లో స్థిర పడ్డారు.
భర్త సహకారంతో తనను తాను సక్సెస్ ఫుల్ మహిళగా ప్రూవ్ చేసుకున్నారు. జిందగీ అన్ లిమిటెడ్ తెలుగు వ్లోగ్స్ పేరుతో స్వంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించారు.
సామాజిక వేదికగా ఆమె ఇప్పుడు ఓ సంచలనం. తెలుగు వారికి ఉపయోగకరంగా ఉండేలా వీడియోలు తయారు చేస్తూ అప్ లోడ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో 2021 సంవత్సరానికి గాను మిసెస్ ఇండియా తెలంగాణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు సంబంధించి ఐదు నెలల పాటు కొనసాగింది.
పలు రౌండ్ల వడపోత అనంతరం అన్నింటిని దాటుకుని ఫైనల్ లిస్ట్ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఓటింగ్ కూడా చేపట్టారు. మొత్తం 50 మందికి పైగా పాల్గొన్నారు.
అందులో షకీరా(Shakeera) రన్నర్ అప్ గా నిలిచి మరోసారి తాను ఆదర్శ మహిళనని నిరూపించుకున్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని షకీరా అంటారు.
అందం ఆభరణమే కానీ అన్నింటికంటే ఆత్మ విశ్వాసం ముఖ్యమని పేర్కొంటారు. అటు తెలుగు, ఇటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.
వీటిపై షకీరాకు మంచి పట్టు ఉండడం కూడా ఓ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఏ ప్రయత్నమైనా ఓ చిన్న అడుగుతోనే ప్రారంభం అవుతుందని అది ఏదో ఒక రోజు లక్ష్యాన్ని సాధించేలా చేస్తుందంటారు.
షకీరా కు చదువుకునే వాళ్లంటే ఇష్టం. అంతే కాదు ఆమెకు పుస్తకాలన్నా, మ్యూజిక్ అన్నా, వంటలన్నా చచ్చేంత ఇష్టం.
తనను రన్నరప్ గా నిలిచేలా చేసిన తెలుగు వారందరికీ ప్రత్యేకించి మిసెస్ పోటీలు నిర్వహించిన నిర్వాహకురాలు మమతా త్రివేదికి ఈ సందర్భంగా షకీరా కృతజ్ఞతలు తెలిపారు.
షకీరా (Shakeera) రాబోయే రోజుల్లో యూట్యూబర్ గా మరిన్ని విజయాలు అందుకోవాలని, గర్వ కారణంగా నిలవాలని ఆశిద్దాం.
Also Read : కష్టపడే వ్యక్తులంటే గౌరవం – హర్నాజ్
Congratulations, you are inspiring every woman.